Adarsha Kutumbam: అనుకున్నదే.. అదేరోజు రానున్న ఆదర్శ కుటుంబం..!
వెంకటేశ్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీపై మేకర్స్ దసరా సందర్భంగా స్పష్టత ఇచ్చారు. ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగానే అక్టోబర్ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు పూర్తి చేసేందుకు సమయం తీసుకున్నట్లు సమాచారం. అదే రోజున అనీష్ నటించిన ‘ఇట్లు అర్జున’, విశ్వక్ సేన్ ‘కల్ట్’ విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి నెలకొంది.
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ అఫీషియల్ అయిపోయింది.. ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్న వెంకీ అభిమానులకు దసరా రోజు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అయితే ఆ సినిమా కారణంగా మరో రెండు చిన్న సినిమాలు మాత్రం బాగా ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఇంతకీ ఆదర్శ కుటుంబం కొత్త డేట్ ఎప్పుడు..? ఆ రోజు రాబోయే మిగిలిన సినిమాల ఫ్యూచర్ ఏంటి..? ఆదర్శ కుటుంబం సినిమా వాయిదా పడిన రోజు నుంచి అదెప్పుడు విడుదల అవుతుందనే కంగారే అందరిలోనూ కనిపిస్తుంది. దసరా సందర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ముందు నుంచి అనుకుంటున్నట్లే అక్టోబర్ 30నే ఆదర్శ కుటుంబం విడుదల చేయబోతున్నారు. అన్నీ చూసుకున్నాకే.. డేట్ అనౌన్స్ చేసామంటున్నారు దర్శక నిర్మాతలు. క్వాలిటీ ఏమాత్రం తగ్గినా సోషల్ మీడియాలో ఆడుకుంటారని.. ఆ భయం కూడా ఉంది కాబట్టే అర్జంట్‌గా సినిమాను తీసుకురావట్లేదని మొన్నామధ్య చెప్పారు నాగవంశీ. ఇప్పుడన్నీ సెట్ అయ్యాయి కాబట్టే మూడు వారాల టైమ్ తీసుకుని పర్ఫెక్ట్ ఔట్పుట్తో అక్టోబర్ 30న రాబోతున్నారు టీం. ఇకపై ప్రమోషన్స్ కూడా నాన్ స్టాప్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30కి వెళ్లడంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద క్లాష్ తప్పట్లేదు. ఆ రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న అనీష్ ఇట్లు అర్జున, విశ్వక్ సేన్ కల్ట్ సినిమాలకు ఇది పెద్ద ముప్పే. ఆదర్శ కుటుంబం లాంటి బడా ప్రాజెక్ట్ వస్తే ఆ యంగ్ హీరోల సినిమాలు వేరే డేట్ చూసుకోవాలి లేదంటే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడాలిక ఏం జరగబోతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: తప్పులు కాదు.. సినిమాలు చూడమంటున్న రావణుడు
దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే
Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర