Urvashi Rautela: AI సంస్థకి హీరోయిన్ ఝలక్.. రూ.7000 కోట్లు డిమాండ్

Updated on: Oct 02, 2026 | 5:10 PM

నటి ఉర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఓ కంపెనీ వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆమె టీమ్‌ ఆరోపించింది. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. నష్టపరిహారంగా రూ.7,000 కోట్లు కోరుతున్నట్లు తెలిపింది. అలాగే ఏఐ కంపెనీలు కూడా ఆమె పేరు, ఫొటోలు, వీడియోలు లేదా గుర్తింపును అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించకూడదని హెచ్చరించింది. AIతో సెలబ్రిటీ కంటెంట్‌ రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

సినీ తారల ఫోటోలు, వీడియో క్లిప్స్ వంటి వాటిని కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సర్వ సాధారణం. దీనికోసం సెలబ్రిటీల అనుమతి తీసుకుంటారు. అయితే.. నటి ఉర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఓ కంపెనీ ఉపయోగిస్తోందని ఆమె టీమ్ ఆరోపించింది. ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ కంపెనీ ఆమె పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తోంది. వీటి ద్వారా ఆ కంపెనీ భారీగా వాణిజ్య ప్రయోజనం పొందిందని టీమ్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో నష్టపరిహారంగా ప్రస్తుతం రూ.7,000 కోట్లు ఇవ్వాలని వెల్లడించింది. ఈ సందర్భంగా ఏఐ కంపెనీలకు కూడా ఉర్వశి టీమ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఎవరైనా ఏఐ కంపెనీని నడుపుకోవచ్చు, తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఉర్వశి పేరు, ఫొటోలు, వీడియోలు లేదా ఆమె గుర్తింపును అనుమతి లేకుండా తమ వ్యాపారంలో ఉపయోగించకూడదని తెలిపింది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు, గొంతులను ఉపయోగించి కొత్త కంటెంట్ తయారు చేయడం సులభంగా మారింది. అయితే.. ఇలాంటి కంటెంట్‌ను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వల్ల న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్‌’ షాక్‌.. భారతీయులపై ఎఫెక్ట్‌

మళ్లీ దగ్గరవుతోన్న భారత్‌-చైనా

ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. తిరిగి చూడగా గుండె గుభేల్‌

ఇక రైల్వే స్టేషనే పోలీస్‌ స్టేషన్‌.. ఏపీలో కొత్త సేవలు!

సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..? థియేటర్‌కు దిమ్మతిరిగే షాక్..

Loading...
Unable to load recommendations.
Follow Us