TVK Vijay: మేనిఫెస్టోలోని హామీలన్నీ విజయ్ తీర్చగలడా ??

Updated on: May 09, 2026 | 12:22 PM

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే విజయానికి వారి మ్యానిఫెస్టో ప్రధాన కారణం. మహిళలు, రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిన హామీలు – మహిళలకు నెలకు రూ.2,500, ఉచిత LPG సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, మద్దతు ధరలు, యువతకు నిరుద్యోగ భృతి, విద్యా రుణాలు – ఓటర్లను బాగా ఆకట్టుకున్నాయి. 'నిజాయితీతో కూడిన పరిపాలన' అనే పార్టీ సిద్ధాంతం, తిరుక్కురళ్ సూత్రాలు విజయానికి మార్గం సుగమం చేశాయి.

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే గెలుపులో ‘మేనిఫెస్టో’ ప్రజల్లో మంచి సానుకూల ప్రభావాన్ని చూపించిందనే చెప్పాలి. ప్రధానంగా మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చారు. 60 ఏళ్లలోపు ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఏడాదికి ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.నిరుపేద వధువుకు బంగారు నాణెం, ఒక పట్టు చీర, తల్లులకు, పుట్టిన శిశువుకు బంగారు ఉంగరం ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. పాఠశాల మానేసే బాలికల సంఖ్యను తగ్గించడానికి, వారి తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి రూ.15,000 అందజేస్తామని తెలిపింది. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పింది. 12వ తరగతి నుంచి పీహెచ్డీ స్థాయి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నియామకాలన్నింటికీ ఒక ‘పారదర్శక’ కాలపరిమితిని వాగ్దానం చేసింది. పట్టభద్రులకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.2,500 నిరుద్యోగభృతిని కూడా అందిస్తామని తెలిపింది. ఐదెకరాలు లోపు భూమి ఉన్న వారికి పంటరుణాల మాఫీ, ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వారికి 50 శాతం రుణ మాఫీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే వరికి క్వింటాల్‌కు రూ.3,500, చెరకుకు రూ.4,500 చొప్పున మద్దతు ధరను ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు రూ.10,000 సాయం, ప్రభుత్వ పథకాలన్నీ పొందేందుకు వీలుగా ప్రతి కుటుంబానికి ఒక కార్డు అందిస్తామని టీఎంకే తెలిపింది. ఏప్రిల్‌ 16న 95 పేజీల మేనిఫెస్టో విడుదల సందర్భంగా విజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువళ్లువర్ రచించిన తమిళ గ్రంథం ‘తిరుక్కురళ్’లోని సూత్రాలైన ‘అరం’ అంటే సద్గుణం, ‘పొరుళ్’ అంటే సంపద, ‘ఇన్‌బం’ అంటే ఆనందం వంటి వాటిపై ఇది ఆధారపడి ఉందని తెలిపారు. ఈ గుణాలే రాజకీయ, పరిపాలనలకు అత్యవసరమైన అంశాలని తెలిపారు. ‘నిజాయితీతో కూడిన పరిపాలనను తన సిద్ధాంతంగా టీవీకే స్వీకరించింది. పార్టీ తొలి ఎన్నికల మేనిఫెస్టో కూడా నిజాయితీకి హామీయే అన్నారు. ప్రజలను తాము తప్పుదోవ పట్టించబోమన్నారు. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో కూడిన తొందరపాటు మేనిఫెస్టోను తాము తయారు చేయలేదన్నారు. విజయ్ మాట్లాడిన ఈ మాటలు తమిళనాడులోని యువ ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. TVKకి ఓట్లు తెచ్చిపెట్టాయి. విజయకు అధికారం దక్కేలా చేశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

Godari Gattupaina Review: డీసెంట్ ఎంటర్టైనర్ గోదారి గట్టుపైన రివ్యూ.. ఎలా ఉందంటే ??

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం

Weather Update: పగలు మండే ఎండలు.. సాయంత్రానికి చిరుజల్లులు

Loading...
Unable to load recommendations.
Follow Us