God of War: గాడ్ ఆఫ్ వార్‌పై క్లారిటీ ఇచ్చిన గురూజీ!
ఎన్టీఆర్‌తో తెరకెక్కించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ మైథలాజికల్ మూవీ స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ‘ఆదర్శ కుటుంబం’ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు. ప్రస్తుతం ‘డ్రాగన్’తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా ఆ సినిమా పూర్తయ్యాక ఈ మూవీ కోసం సిద్ధం కానున్నారు.
మాటల మాంత్రికుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా మైథాలజికల్ జానర్లో తెరకెక్కబోతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌పై ఫస్ట్ టైమ్ పబ్లిక్‌గా రియాక్ట్ అయ్యారు గురూజీ. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ అప్డేట్స్తో తారక్ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కమర్షియల్ యాక్షన్ సినిమాలే తెరకెక్కించారు. ఫస్ట్ టైమ్ సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్‌తో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే భారీ పాన్ ఇండియా మైథలాజికల్ మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఎనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా మాట్లాడని త్రివిక్రమ్, ఫస్ట్ టైమ్ ఓ టాక్ షోలో అసలు విషయాలు రివీల్ చేశారు. వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో భాగంగా జగపతిబాబు టాక్ షోలో పాల్గొన్న త్రివిక్రమ్, ‘గాడ్ ఆఫ్ వార్’ గురించి మాట్లాడారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయన్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్‌పై ఉన్న ‘న జానామి శబ్దం న జానామి చార్థం’ అనే సంస్కృత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ.. ఆరు ముఖాల షణ్ముఖుడి రూపం తన హృదయంలో ప్రకాశించగానే మాటలు, స్తోత్రాలు వాటంతట అవే కవిత్వంలా ప్రవహించాయని, ఇదంతా దైవ సంకల్పమేనని ఎమోషనల్ అయ్యారు గురూజీ. ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ మైథాలజికల్ యాక్షన్ డ్రామా మీద నేషనల్ లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ కాగానే పూర్తిగా ‘గాడ్ ఆఫ్ వార్’ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీతో బిజీగా ఉన్న తారక్, వచ్చే సమ్మర్ నాటికి ఆ సినిమాను పూర్తి చేసి ఫ్రీ కానున్నారు. ఆ వెంటనే ఎన్టీఆర్ మేకోవర్ మార్చుకుని ‘గాడ్ ఆఫ్ వార్’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..
Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ
Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్
ఒక్కో ఇన్విటేషన్ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?
Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!