Trisha Tattoo: త్రిష చేతిపై ఉన్న టాటూకు.. విజయ్‌కు సంబంధం ఏంటి ??

Updated on: May 12, 2026 | 11:48 AM

త్రిష చేతిపై వృషభ రాశి టాటూ, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు వైరల్ అయ్యింది. ఆమె టాటూకు, విజయ్ అదృష్టానికి సంబంధం ఉందా అని నెటిజన్లు చర్చించారు. త్రిష రాశి వృషభం కాగా, విజయ్ రాశి కర్కాటకం. ఈ రాశుల కలయిక అదృష్టాన్ని తెస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ప్రస్తుతం విజయ్, త్రిష పేర్లు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. తమిళనాడు స్టార్ హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే అందరి కళ్లు త్రిష కంటే.. ఈమె చేతిపై ఉన్న టాటూపైనే పడ్డాయి. దీంతో చాలా మంది.. ఈ టాటూకు విజయ్‌కు ఏదైనా సంబంధం ఉందా? అసలు ఆ టాటూ అర్థం ఏంటని కనుక్కునే పనిలో పడ్డారు. నీలి రంగు కాంజీవరం చీర, కొప్పులో మల్లెపూలు, అందానికే అసూయ పుట్టే విధంగా, సంప్రదాయ పద్ధతిలో రెడీ అయ్యి, ప్రతి ఒక్కరినీ తన వైపుకు తిప్పుకుంది. అంతే కాకుండా ఈ చిన్నది, అందరికీ హాయి చెబుతూ, వేడుకలో హడావిడి చేసింది. ఫోటోలకు ఫోజిస్తూ.. కార్యక్రమానికి వచ్చిన వారితో కలివిడిగా మాట్లాడుతూ కనిపించింది. దీంతో కొంత మంది ఆ కార్యక్రమం తర్వాత… త్రిషను జయలలితతో పోలుస్తూ మీమ్స్ చేసి నెట్టింట తెగ వైరల్ చేశారు. అంతేకాదు త్రిష చేతిపై ఉన్న ట్యాటూను కూడా ఆసక్తిగా గమనించిన కొంత మంది.. ఆ టాటూ‌కు విజయ్‌కి ఏమైనా సంబంధం ఉందా? అది విజయ్‌కి అదృష్టాన్ని తీసుకొచ్చిందా? అసలు విజయ్ లక్కు మార్చింది ఆ టూటూనేనా? అంటూ.. వారికి తోచిన చర్చను షురూ చేశారు. అయితే అసలు ఆ టాటూ విషయానికి వస్తే, అది వృషభ రాశికి సంబంధించిన టాటూ. త్రిష రాశి వృషభ రాశి. తనకు తన రాశి అదృష్టాన్ని తీసుకొచ్చిందని తాను బలంగా నమ్ముతుందంట. అందుకే తన రాశిని ఈ బ్యూటీ తన చేతిపై టాటూ వేయించుకున్నదట. అంతే కాకుండా విజయ్ రాశి కర్కాటక రాశి. అయితే వృషభ రాశి, కర్కాటక రాశి కలయిక చాలా మంచిదని, దీని వలన ఊహించని విధంగా లక్కు కలిసి వస్తుందని, పండితులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: ‘ప్రేమ ఎప్పుడూ గొప్పదే..’ అంటూ త్రిష క్రేజీ ట్వీట్ !!

CM Thalapathy Vijay: సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా ??

CM Vijay: అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు

RK Roja: నా చిన్నారి అన్షు.. ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది !! రోజా ఎమోషనల్..

Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి

Follow Us