అందం కాదు అభినయం.. హీరోయిన్ల కొత్త ట్రెండ్..

Edited By:

Updated on: Apr 21, 2026 | 6:59 PM

వెండితెరపై గ్లామర్ డాల్స్‌గా మెరిసిన నటీమణులు ఇప్పుడు డీ-గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మమిత బైజు, కయాదు లోహర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి తారలు మేకప్ లేకుండా పల్లెటూరి పడుచులుగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కేవలం నటనకు ప్రాధాన్యత ఇవ్వడమా లేక కెరీర్‌కు కొత్త విజయ సూత్రమా అనే చర్చ సాగుతోంది. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ ట్రెండ్ సినీ రంగంలో కొత్త మార్పులకు సంకేతం.

వెండితెరపై గ్లామర్ డాల్స్‌గా మెరిసిపోయే ముద్దుగుమ్మలు సడెన్‌గా మేకప్ తీసేసి డీ గ్లామర్ బాట ఎందుకు పడుతున్నారు..? గ్లామరస్ రోల్స్ వదిలేసి మరీ పల్లెటూరి పడుచులుగా, డీ గ్లామర్ లుక్స్‌లో కనిపించడానికి అసలు కారణం ఏంటి..? ఇదంతా యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రల కోసమా లేక ఇదొక కొత్త సక్సెస్ ఫార్ములానా..? ప్రేమలు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాల్లో తన క్యూట్ గ్లామరస్ లుక్స్‌తో కుర్రాళ్ల మనసు దోచేసారు మలయాళ కుట్టి మమిత బైజు. కానీ ఇప్పుడు ఈమె స్టైల్ మార్చి ధనుష్ హీరోగా నటిస్తున్న కర సినిమాలో మాత్రం పూర్తిగా మేకప్ లేని డీ గ్లామర్ లుక్‌లోకి మారిపోయి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.. ఏప్రిల్ 30 సినిమా విడుదల కానుంది. డ్రాగన్, ఫంకీ లాంటి సినిమాల్లో మోడరన్ డ్రెస్సుల్లో తన అందంతో మాయ చేసిన కయాదు లోహర్ కూడా పల్లెటూరి దారి పట్టారిప్పుడు. టొవినో థామస్ హీరోగా వచ్చిన పళ్లిచట్టంబిలో ఈ భామ మోడరన్ లుక్స్ పక్కనపెట్టి అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ అవతారంలో ప్రేక్షకులను అలరించారు.. ఈ సినిమా నటిగా ఈమెకు బాగా హెల్ప్ అయింది. బాలీవుడ్‌లో గ్లామర్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ సైతం సౌత్ సినిమాల కోసం తన స్టైల్ మార్చేసి పక్కా లోకల్ విలేజ్ గాళ్‌గా మారిపోయారు. రామ్ చరణ్ పెద్ది సినిమాతో పాటు ఎన్టీఆర్ దేవర 2లో కూడా జాన్వీ కపూర్ క్యారెక్టర్లు పూర్తిగా డీ గ్లామర్‌గానే ఉండబోతున్నాయి. తెలుగులో జాన్వీకి గ్లామరస్ రోల్స్ ఇంకా రాలేదు. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా గ్లామర్ షో కన్నా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ఎక్కువ ఓటు వేస్తూ డీ గ్లామర్ లుక్స్‌తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న మైసాతో పాటు రణబాలి సినిమాల్లో కూడా ఈ బ్యూటీ పూర్తిగా డీ గ్లామర్ లుక్‌లోనే కనిపించి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త

త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు

పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’

రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?

Published on: Apr 21, 2026 06:59 PM
Follow Us