టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు

Updated on: Aug 20, 2026 | 3:38 PM

టాలీవుడ్‌లో ఫిల్మ్‌ ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్‌ మధ్య వివాదం మరింత ముదిరింది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఇప్పటికే సహాయ నిరాకరణ చేస్తున్న ఫిల్మ్‌ ఫెడరేషన్ తాజాగా అత్యవసర సమావేశం నిర్వహించింది. 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన బైలాస్‌ సవరణపై చర్చ జరిగింది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ను మినహాయించి మిగతా 23 క్రాఫ్ట్స్‌ అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. అసోసియేషన్‌ను 24 క్రాఫ్ట్స్ నుంచి తొలగించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

టాలీవుడ్‌లో డ్యాన్సర్స్ అసోసియేషన్‌ వివాదం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఫిల్మ్‌ ఫెడరేషన్.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఇప్పటికే, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి సహాయ నిరాకరణ చేస్తోన్న ఫిల్మ్‌ ఫెడరేషన్.. మరిన్ని చర్యలు తీసుకునేందుకు అత్యవసరంగా సమావేశమైంది. ఫిల్మ్‌ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో… 24 క్రాఫ్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్‌ సవరణపై చర్చ జరిగింది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్‌కి ఆహ్వానం అందింది. 23 క్రాఫ్ట్స్‌ అధ్యక్షులు, కార్యదర్శులు డ్యాన్సర్స్ అసోసియేషన్‌తో నెలకొన్న విభేదాలపైనే ప్రధానంగా చర్చ సాగింది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి ఇప్పటికే సహాయ నిరాకరణ చేస్తోన్న ఫిల్మ్‌ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ నుంచి డ్యాన్సర్స్ అసోసియేషన్‌ని తప్పించడంపై నిర్ణయం కీలకం నిర్ణయంతీసుకుంది. 23 క్రాఫ్ట్స్‌కే పరిమితం చేస్తూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ బైలాస్‌ సవరించే అవకాశం కనిపిస్తోంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుమలత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా… సినీ పెద్దలు చెప్పినా వినకుండా ఉపఎన్నికలు నిర్వహించిన సుమలత తీరుపై సభ్యులందరూ గుర్రుగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బఘీరా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారా.. NTR ఎమోషనల్!

Balakrishna 111: గాయాన్ని లెక్కచేయకుండా.. బాలయ్య మొండి పట్టు

నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం

Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్‌’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!

Loading...
Unable to load recommendations.
Follow Us