TOP 9 ET News: NTR ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌లు
నటుడు ప్రకాష్ రాజ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం కావడానికి ప్రతిపక్షాలే కారణమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులను తాకట్టు పెట్టవద్దని కోరుతూ, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాలు విసిరారు.మోదీని ప్రసన్నం చేసుకోవడానికి సొంత ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపాలంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని ప్రకాశ్ రాజ్ గుర్తు చేశారు.
తమ అభిమాన హీరో బర్త్ డే కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు ఇప్పుడో గుడ్ న్యూస్. మే 20.. తారక్ బర్త్ డే రోజు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు త్రివిక్రమ్స్ గాడ్ ఆఫ్ వార్.. అప్డేట్‌తో పాటు మరి కొన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ‘దేవర 2’ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత
తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు
‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో
Follow Us
