TOP 9 ET News: NTR క్రేజ్‌తో దందా..డబ్బు దండుకుంటున్న కేటుగాళ్లు

Updated on: Feb 13, 2025 | 6:07 PM

అది ఎన్టీఆర్ సినిమా.. ! పైగా బాలీవుడ్‌లో చేస్తున్న ఫస్ట్ సినిమా..! దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కాస్తా వార్ 2 సినిమా పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వార్ 2 సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. తారక్ క్యారెక్టరైజేషన్ .. అండ్ లుక్ గురించి తెలుసుకునేందుకు ఎగిరిపడుతున్నారు. దీంతో కొంత మంది లీకర్స్ తారక్ క్రేజ్‌ను ఎన్‌క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తారక్ వార్ 2 సెట్‌లో ఉన్న ఫోటోలను క్యాప్చర్ చేసి నెట్టింట లీక్ చేస్తున్నారు. అలా యంగ్ టైగర్ క్రేజ్‌తో.. వైరల్ అవుతూ నెట్టింట నుంచి డబ్బు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ కేటుగాళ్లు చేసే పని రైటో రాంగో పక్కకు పెడితే.. ఈ స్టార్ హీరో ఫ్యాన్స్‌ మాత్రం ఎన్టీఆర్ సినిమాలోకి లీక్‌డ్ పిక్స్ చూసి నెట్టింట ఫిదా అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. తెలుగువాళ్లు ఉన్న ప్రతీ చోటా క్రేజ్ తెచ్చుకున్నాడు బుల్లి రాజు అలియాస్ రేవంత్ భీమాల. అయితే ఈ బుడ్డోడికి వచ్చిన ఈ క్రేజ్‌ను గమనించిన కొంత మంది ఫేక్ గాళ్లు…ఈ చిన్నోడి పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. రాజకీయపరమైన పోస్టులు పెడుతున్నారు. బుల్లి రాజు క్రేజ్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఇది గమనించిన బుల్లి రాజు తండ్రి అందరికీ క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటే ఈ ఫేక్ అకౌంట్ల పై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. కొంపముంచిన సిబిల్‌ స్కోర్‌.. ఏం జరిగిందంటే

రోజూ గ్లాసుడు నీళ్లలో చిటికెడు కలిపి తాగండి శరీరంలో జరిగే మ్యాజిక్‌ చూడండి

ఈ చిట్కాలతో.. గ్యాస్ సిలెండర్లో గ్యాస్ ఎంత మిగిలిందో తెలుసుకోండి