TOP 9 ET : ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ

Updated on: Feb 11, 2026 | 8:52 PM

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపు మెసేజ్ రావడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలంగా మారింది. ధురంధర్ సినిమా హిట్ తర్వాత.. టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్న ఈ హీరోను... డబ్బులు డిమాండ్ చేస్తూ ఓ ఆగంతకుడు.. వాట్సాప్‌లో వాయిస్ నోట్ పంపించాడు. అంతేకాదు ఆ నోట్‌లో తనను తాను లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన వాడినంటూ.. ఆ దుండగుడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. దీంతో.. రణ్‌వీర్ ఈ విషయాన్ని ముంబై పోలీసుల వరకు తీసుకెళ్లాడని.. ముంబయ్‌ పోలీసులు కూడా.. వెంటనే హీరో ఇంటి దగ్గర భద్రతను పెంచారని తెలుస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ లాంటి హీరోతో యాడ్‌ షూటింగ్‌ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉంటాయంటూ.. ప్రముఖ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరీ బారువా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. అందర్నీ అవాక్కయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె కామెంట్స్ పై అల్లు అర్జున్ టీం.. తీవ్రంగా రియాక్టైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని నోట్ రిలీజ్ చేసింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్‌ విడుదల చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

Jr NTR: ఎన్టీఆర్‌పై వార్ 2 ఎఫెక్ట్.. ఆ మాత్రం ఉంటుందిలే

Published on: Feb 11, 2026 08:49 PM