Top 9 ET News: ఇది గాలివాటంగా వచ్చిన విజయమా ?? విజయే నమ్మడం లేదా??

Updated on: May 06, 2026 | 5:48 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా.. మ్యాజిక్ ఫిగర్‌కి ఇంకా 11 అభ్యర్థుల దూరంలోనే ఉన్నాడు విజయ్‌. ఈ క్రమంలోనే ఆ పదకొండు మంది అభ్యర్థులను సమీకరించే పనిలో ఉన్నాడు ఈయన. అయితే మరో పక్క ప్రభుత్వంలోకి క్వీన్ అనేలా.. త్రిష పేరును తెరపైకి తెస్తూ కొన్ని వార్తలు తమిళ స్టేట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రభుత్వంలోకి రావడం పక్కా అని.. నామినేటెడ్ పోస్ట్ దక్కడం గ్యారెంటీ అని.. విజయం స్థానంలో నిలబడడం మన చూస్తామని.. మరో జయలలిత తనే అని.. ఇలా రకరకాల వార్తలు తమిళ మీడియాలో ప్రచురితమవుతున్నాయి. అయితే ఈ వార్తలను కొందరు కొట్టిపారేస్తుండగా.. మరి కొందరమేమో.. ఏదైనా ఏమో.. ఏదైనా జరగవచ్చని అంటున్నారు.

టీవీకే పార్టీ ప్రకటించిన, సరిగ్గా 2 సంవత్సరాల 3 నెలల తర్వాత విజయ్ తలపతి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాడు. 234 స్థానాలకు గాను దాదాపు 109 స్థాలను కైవసం చేసుకున్నాడు. అయితే విజయ్‌ విజయం పై నెట్టింట ఇప్పుడో షాకింగ్ చర్చ నడుస్తోంది. విజయ్‌ గాలి వాటంగానే.. అడ్డిమారి గుడ్డిగానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాడని కొంత మంది చెబుతుండడం తమిళనాట కనిపిస్తోంది. ఫిబ్రవరి 2,2024 లో తమిళగ వెట్రి కజనం పార్టీ స్థాపించినప్పుడే.. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను, విజయ్‌ లక్ష్యంగా నిర్ధేషించుకున్నప్పటికీ.. అది సాధ్యం కాదని తలపతి భావించాడట. అందుకే 2026లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 20 స్థానాలనైనా కైవసం చేసుకుని.. ప్రతిపక్షంలో కూర్చొన.. రాజకీయాలను అవపోసాన పట్టాలని అనుకున్నాడట. తన గళాన్ని గట్టిగా వినిపించాలని ప్లాన్ చేశాడట. ఆ తర్వాత వచ్చే 2031 ఎలక్షన్స్‌లో విజయం సాధించాలని నిర్ధేషించుకున్నాడట. అందుకు ఈ ఎలక్షన్స్‌లో 234 నియోజకవార్గాల్లో .. జస్ట్ 36నియోజక వర్గాల్లోనే ప్రచారం చేశాడు విజయ్‌. అది కూడా మెయిన్‌ రోడ్ల పైనే. అయినా కానీ తానే నమ్మలేని విధంగా విజయ్‌ విక్టరీ సాధించడం ఇప్పుడు సంచలనం అవుతోంది. విజయ్ పార్టీ నేతలనే అవాక్కయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: పసిడి పరుగు.. పెట్టుబడికి సరైన సమయమేనా ??

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్‌.. భిన్న వాతావరణం తో అకాల వర్షాలు

Divvala Madhuri: ‘ఇలా అయితే రాజకీయాలు కష్టం’ త్రిషను ఉద్దేశిస్తూ మాధురి షాకింగ్ పోస్ట్

Thalapathy Vijay: చదువు అంతంత మాత్రమే.. కానీ పట్టుదల కొండంత

Chiranjeevi: అప్పట్లో విజయ్‌ తండ్రికి.. ఛాన్స్ ఇచ్చింది చిరంజీవే

Follow Us