TOP 9 ET News: పవర్ ఫుల్ ట్రైలర్ వచ్చేస్తోందోచ్… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!
మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలియజేస్తూ నయా పోస్టర్‌ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
వస్త్రధారణ వివాదం కాస్తా ఇప్పుడు నా అన్వేషణ కాంట్రో కామెంట్స్ వైపు మళ్లింది. ఇప్పుడది ఏజూడ్- నా అన్వేషణ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. హిందూ దేవతల గురించి.. యూట్యూబర్ అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హిందువులు అందరూ ఇతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏజూడ్ కూడా అన్వేష్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో ఓ వీడియోను వదిలాడు. ఆ వీడియోను చూసిన అన్వేష్.. ఏజూడ్‌పై సీరియస్ అయ్యాడు. తనను తిడుతూ చేసిన వీడియోను డిలీట్ చేయకపోతే.. నీ గుట్టు రట్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఏజూడ్ వీడియోను డిలీట్ చేశాడు. అయితే వీరద్దరి వీడియోలను.. గమనిస్తున్న నెటిజన్లు.. అన్వేష్ ఇచ్చిన దమ్కీఖి ఏజూడ్ వీడియో డిలీజ్ చేయడం ఏంటని నెట్టింట నానా రచ్చ చేశారు. ఈ క్రమంలో మళ్లీ.. డిలీట్ చేసిన వీడియోను రీ అప్లోడ్ చేశాడు ఏజూడ్. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో మాటలు రువ్వుకుంటూ ఉండగా… కొంతమంది నెటిజన్లు.. ఉన్నది చాలదన్నట్టు మధ్యలో వీరిద్దరి గోలొకటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
న్యూ ఇయర్ వేళ డెలివరీ బాయ్ ఎమోషనల్..కారణం ఇదే
సిగరెట్ రూ.18 కాదు.. ఇక రూ.72
తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే
