TV9 Digital ET TOP 9 News: ప్రాణాలతో భయటపడ్డ రణ్‌భీర్ కపూర్.. | NTR చెప్పిన జాగ్రత్త..రక్షించలేకపోయింది!

|

Jul 30, 2022 | 9:06 PM

సూపర్‌ స్టార్ మహేష్ బాబు బర్త్‌ డే డేట్‌ దగ్గర పడుతుండటంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. విదేశాల్లో పోకిరి సినిమా స్పెషల్‌ షోస్‌ ప్లాన్ చేశారు. ఆస్ట్రేలియా,

వెల్‌ కమ్ టూ టాప్ 9 ఈటీ.. జూలై 30th టాప్ 9 న్యూస్ ఏంటో ఇప్పుడు క్విక్‌ గా చూసేద్దాం.

1. Pokiri –
సూపర్‌ స్టార్ మహేష్ బాబు బర్త్‌ డే డేట్‌ దగ్గర పడుతుండటంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. విదేశాల్లో పోకిరి సినిమా స్పెషల్‌ షోస్‌ ప్లాన్ చేశారు. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన షోస్‌కు సంబంధించిన బుకింగ్స్‌ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి.

2. Ravi teja –
మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మాస్ మహరాజ్‌ రవితేజ. ప్రస్తుతం ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో… శ్రీవాస్ దర్శకత్వంలో మరో మూవీకి ఓకే చెప్పారు. అయితే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయ్యాకే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

3. Simbu –
మానాడు సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శింబు భారీ చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసిన ఈ కోలీవుడ్ హీరో.. నెక్ట్స్ మురుగదాస్‌ డైరెక్షన్‌లో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిస్తున్నారు మురుగదాస్.

4. Ajith –
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ షూటర్‌గా వరుస విజయాలు సాధిస్తున్నారు. తాజాగా తిరుచ్చిలో జరిగిన 47వ తమిళనాడు స్టేట్‌ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్‌తో పాటు రెండు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. ప్రస్తుతం హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు అజిత్‌.

5. Salman Khan –
బెదిరింపుల నేపథ్యంలో భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కండల వీరుడు సల్మాన్‌ ఖాన్. ఇక మీదట బుల్లెట్‌ ప్రూఫ్ వెహికల్‌లోనే ప్రయాణాలు చేయాలని నిర్ణయించారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న సల్మాన్‌ను చంపేస్తామంటు లారెన్స్‌ బిషనోయ్‌ గ్యాంగ్‌ వార్నింగ్ ఇచ్చింది.

6. EK Villain
బాలీవుడ్‌ ఇండస్ట్రీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత వారం రిలీజ్ అయిన షంషేరాకు డిజాస్టర్ టాక్‌ రాగా.. తాజాగా ఏక్‌ విలన్‌ రిటర్న్స్ మూవీ కూడా నిరాశపరిచింది. జూలై 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.

7. Ramsetu –
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ చిక్కుల్లో పడ్డారు. రామ్ సేతు సినిమా కంటెంట్‌కు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అక్షయ్‌తో పాటు నిర్మాణ సంస్థ కర్మా మీడియాపై కేసు వేశారు బీజేపీ నేత సుబ్రహ్మాణ్య స్వామి. అక్షయ్‌ కుమార్ ఇండియన్ సిటిజెన్ కాదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

8.
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లవ్‌ రంజన్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న మూవీ సెట్ లో తాజాగా అగ్ని ప్రమాదం సంభవించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే రణ్భీర్ కపూర్ అక్కడ లేక పోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని సోషల్ మీడియాలో రణభీర్ కేమైందని ఆరా తీసే వారు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. ఆయన క్షేమంగా ఉండాలని కోరకుంటున్నారు.

9.
భారీవర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. కంగారుపడకండి.. దయచేసి జాగ్రత్తగా వెళ్లండి.. ఇది బింబిసార ఈవెంట్లో అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ చేసిన విజ్ఞప్తి. అయితే ఇలా భారీవర్షాలపై యంగ్ టైగర్ అప్రమత్తం చేసిన కాసేపటికే విషాదం చోటుచేసుకుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళుతూ.. తన అభిమాని సాయి రాం ప్రమాదంలో మరణించడం అందర్నీ షాక్‌ చేసింది. అయితే సాయిరాం మృతిని అనుమాదాస్పద మృతిగా అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరో వైపు సాయి రాం కుటుంబానికి అండగా ఉంటామని ఎన్టీఆర్ క్రియేషన్స్ టీం సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Follow us on