TOP 5 ET: పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు?|బాలయ్యే కావాలంటున్న స్టార్ డైరెక్టర్లు

Updated on: Feb 11, 2026 | 8:51 PM

స్టార్ డైరెక్టర్లందరూ ఇప్పుడు బాలయ్య వైపే చూస్తున్నారు. బాలయ్యే కావాలంటున్నారు. కథలను పట్టుకుని బాలయ్య కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య కోసం ఓ మాఫియా డాన్ క్యారెక్టర్‌ను రాసుకుని.. గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టేశాడు. ఇక ఈయన కాకుండా.. మార్కో డైరెక్టర్ హనీఫ్‌.. బాలయ్యతో సినిమా తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. దిల్ రాజు, వీరి కాంబోను సెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టాక్.

పెద్ది క్రేజ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చరణ్ చేస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ కూడా ఇప్పుడు చరణ్‌ కెరీర్లోనే రికార్డ్‌ ధరకు అమ్ముడైపోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 9.5 మిలియన్స్ డాలర్స్‌కు అమ్ముడుపోయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గేమ్ చేంజర్‌ ప్లాప్ తర్వాత.. చరణ్‌ సినిమాకు ఈ రేంజ్‌ డీల్ సెట్టు అవ్వడం .. చెర్రీ క్రేజ్‌కు ఎగ్జాంపుల్‌గా కోట్ చేస్తున్నారు కొంత మంది ఫిల్మ్ అనలిస్టులు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రామ్ చరణ్‌ పెద్ది సినిమా ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఓటీటీ ఫీల్డ్‌లో నెట్‌ఫ్లిక్స్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓ సినిమాకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉందని తెలిస్తే చాలు.. కళ్లు తిరిగే ఫిగర్‌కు.. ఆ రైట్స్‌ను దక్కించుకుంటుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా కోసం డబ్బులు నీళ్లలా ఖర్చు చేసిందనే టాక్ ఉంది. ఎస్ ! ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం.. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 140 కోట్ల రూపాయలను కోట్ చేసినట్టుగా న్యూస్. ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET : ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..