OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్.. రసవత్తరంగా సాగే కథ
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ 'ఫిల్తీ రిచ్' ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన ఈ భారీ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం, అందులో ఎప్‌స్టీన్ పాత్ర, బాధితుల వేదనలు ఈ సిరీస్‌లో చూపబడ్డాయి. జైలులో అతని అనుమానాస్పద మరణం, ప్రముఖుల ప్రమేయం ఈ కథకు మరింత ఉత్కంఠను జోడిస్తున్నాయి. పాత సిరీస్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో.. ఎప్‌స్టీన్ అనే వ్యక్తి పేరు తెగ వైరల్ అవుతోంది. ఆయన చేసిన నేరాలు.. అందుకు సంబంధించిన రియల్ అండ్ ఏఐ ఫోటోలు కూడా నెట్టింట తెగ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఓ వెబ్ సిరీస్.. ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. 6 ఏళ్ల క్రితమే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చినప్పటికీ.. ఇప్పుడు ఉన్నట్టుండి ఇతని గురించి అందరూ తెలుసుకోడానికి ఆసక్తి చూపుతుండడంతో.. ఆ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. అమెరికాకు చెందిన ఎప్‌స్టీన్.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఈయన పై ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడని.. చెప్పేవాడట. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది. ఈ క్రమంలోనే 2005లో ఎప్‌స్టీన్‌ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో ఎప్‌స్టీన్న చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్‌స్టీన్ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా ‘జెఫ్రీ ఎప్‌స్టీన్ : ఫిల్తీ రిచ్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు. తాజాగా ఎప్‌స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్‌గా ఎప్‌స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kona Venkat: కంటెంట్ ఉంటే.. సినిమా హిట్టే..
ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
కేబుల్ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం
