Varanasi: ఇట్స్ షాకింగ్..వారణాసి స్టోరీ రివీల్ చేసిన రాజమౌళి

Edited By:

Updated on: Oct 21, 2026 | 5:29 PM

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న ‘వారణాసి’ కథపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రెజిల్‌లో జరిగిన సావో పాలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న, షూటింగ్‌ మరో పది రోజుల్లో పూర్తయ్యే అవకాశముందని వెల్లడించినట్లు కథనం చెబుతోంది. తండ్రీకొడుకుల బంధం, ప్రేమకథతో పాటు రామాయణ నేపథ్యంలోని మైథలాజికల్‌ ఫాంటసీగా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వకుండా ‘వెరీ సూన్‌’ అని పేర్కొన్నట్లు సమాచారం.

‘వారణాసి’ కథేంటి.. అందులో మహేష్ రోల్ ఎలా ఉండబోతోంది..? ఇప్పుడే ఇవన్నీ ఎవరు చెప్తారనుకుంటున్నారు కదా..? కానీ రాజమౌళే చెప్పారు.. బ్రెజిల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న వారణాసి లైన్ ఏంటో.. షూటింగ్ ముచ్చట్లేంటో మొత్తం లీక్ చేసారు.. కానీ అసలు విషయంపై మాత్రం నోరు మెదపలేదు. అసలు వారణాసి షూట్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది.. ఈ ఫాంటసీ వండర్ కథేంటో చూసేద్దామా..?బ్రెజిల్‌లో జరిగిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న రాజమౌళి.. వారణాసి అప్‌డేట్స్ చెప్పారు. షూటింగ్ మరో 10 రోజుల్లో పూర్తి కానుందని.. ఈ సినిమాను కచ్చితంగా బ్రెజిల్‌లో కూడా రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఆరేడు భిన్నమైన సినిమాలను ఒకే కథగా మలచడమే వారణాసిలో తాము ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ అన్నారు జక్కన్న. దెబ్బతిన్న తండ్రీకొడుకుల బంధం మళ్లీ ఎలా ఒకటైందనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ వారణాసి కథ తిరుగుతుందని రాజమౌళి రివీల్ చేశారు. దీనికి తోడు ఒక అందమైన లవ్ స్టోరీ కూడా హైలైట్‌గా నిలవనుందని ఆయన తెలిపారు. అందరూ అనుకుంటున్నట్లు ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కాదని, రామాయణ నేపథ్యంతో ముడిపడి ఉన్న అద్భుతమైన మైథలాజికల్ ఫాంటసీ చిత్రమని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. రుద్రతో పాటు శ్రీరాముడిగా ఇందులో మహేష్ బాబు నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆఫ్రికా, అంటార్కిటికా, ఉగర్‌బతి గుహలతో పాటు వారణాసిలో జరిగే టైమ్ ట్రావెల్ ఎపిసోడ్స్ ఒక్కొక్కటి ఒక్కో సినిమా రేంజ్‌లో ఉంటుందని ఊరిస్తున్నారు రాజమౌళి. అన్నీ చెప్పినా రిలీజ్ డేట్ మాత్రం ఎప్రిల్ 7 అని చెప్పకుండా వెరీ సూన్ అని ముగించారీయన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవరగట్టు..తలలు పగిలినా తగ్గేదే లే..ఈ రణరంగం వెనుక చరిత్ర ఇదే

Gold Prices Update: స్థిరంగా బంగారం ధర..తగ్గిన వెండి ధర

పాలపిట్టను చూసేదెలా.. దాన్ని పట్టుకుంటే జైలుకే

తగ్గిపోతున్న చందమామ సైజు.. భూమికి ప్రమాదం పొంచి ఉందా!

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి పిల్లి .. ఆ తర్వాత..

Loading...
Unable to load recommendations.
Follow Us