Sonu Sood: దుబాయ్‌లో చిక్కుకున్న ప్రయాణికులకు సోనూ సూద్ అభయం

Updated on: Mar 06, 2026 | 7:38 PM

కష్టాల్లో ఉన్నవారికి 'నేనున్నానంటూ' భరోసా ఇచ్చే రియల్‌ హీరో సోనూ సూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన ప్రకటించారు.

కష్టాల్లో ఉన్నవారికి ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చే రియల్‌ హీరో సోనూ సూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్‌లో విమాన సర్వీసులు హఠాత్తుగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన ప్రకటించారు. సహాయం కావాల్సిన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని సోనూ సూద్ కోరారు. తన ఇన్‌స్టాగ్రామ్‌కు సందేశం పంపిస్తే, తన బృందం వెంటనే స్పందించి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సహాయానికి ఎలాంటి షరతులు వర్తించవని, ఏ దేశస్థులైనా సరే కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటమే మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. “ఇలాంటి సంక్షోభ సమయంలో మనుషులుగా ఒకరికొకరం అండగా ఉండటం చాలా ముఖ్యం” అని సోనూ సూద్ తన సందేశంలో తెలిపారు. గతంలో కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంత ఊళ్లకు చేర్చడంలోనూ, విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడంలోనూ సోనూ సూద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ సంక్షోభంలో చిక్కుకున్న సామాన్యుల కోసం ఆయన ముందుకు రావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సంక్షోభ సమయాల్లో మానవత్వానికి అసలైన చిరునామా సోనూ సూద్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒంటిమిట్ట రాముడికి భక్తుడి భారీ విరాళం..

ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం

టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI

Chiranjeevi: వరప్రసాద్ ఎఫెక్ట్.. అస్సలు ఏ మాత్రం తగ్గని చిరు

టాలీవుడ్ లో నెంబర్ వన్ కుర్చీ దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా !

Follow Us