‘వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!’ న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణలు

Updated on: Apr 15, 2026 | 1:29 PM

మంగ్లీ తనపై వస్తున్న మైక్రోఫైనాన్స్ స్కామ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను కేవలం పాటే ప్రపంచంగా జీవిస్తున్నానని, వ్యాపారాలు తెలియవని స్పష్టం చేశారు. లాయర్ సుబ్బారావు బిగ్‌బాస్‌లో చేరాలనే లక్ష్యంతో తనను వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే అసత్య ప్రచారాలపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కోట్ల స్కామ్ ప్రచారంలో నిజం లేదని కుండబద్దలు కొట్టారు.

తన మీద వస్తున్న మైక్రోఫైనాన్స్ ఆరోపణలపై కాస్త లేటయినా ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంగ్లీ. మనీ మ్యాటర్‌.. లాయర్ ఆరోపణలు.. ఈ రెండింటిని తిప్పికొట్టారు. తన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల స్కామ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారామె. అంతేకాదు బిగ్ బాస్ రియాల్టీ షోకు వెళ్లాలనే సుబ్బారావు కలలుగంటున్నారని.. ఆ డ్రీమ్‌లో భాగంగానే తనను సీన్‌లోకి లాగారని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో ఎదిగిన తనను.. అదే సోషల్ మీడియా అప్రతిష్టపాలు చేస్తుందని ఊహించలేదని మంగ్లీ కన్నీటిపర్యంతమయ్యారు. కాస్త ఎమోషనల్‌ అవుతూనే ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌తో సంబంధం లేదని మంగ్లీ కుండబద్దలు కొట్టారు. ‘నేను పాటే ప్రపంచంగా బతుకుతున్నాను. నాకు పాట తప్ప ఇంకొక వ్యాపారం తెలియదు. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. పాటలతో నాకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలుసు కదా. అలాంటప్పుడు నాకు మరో బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి. సుబ్బారావు అనే న్యాయవాది సెలేబ్రిటిగా మారాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యం. అందుకే ఇలాంటి వివాదాలు పెట్టుకుంటున్నాడు. సుబ్బారావుకి భరతనాట్యం తెలుసు. సినిమాలు అంటే పిచ్చి. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను ఇలా ఇరికించాలి అని ప్రయత్నిస్తున్నాడు” అంటూ ఎమోషనల్ అయ్యింది మంగ్లీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jananayagan: విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో ‘జననాయగన్‌’ మూవీ..

Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం

Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

Loading...
Unable to load recommendations.
Follow Us