అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలోని యాలాల మండలంలో గుప్తనిధుల కోసం పురాతన ఆలయం వద్ద అర్ధరాత్రి జేసీబీతో తవ్వకాలు జరపడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడిన వారిలో సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలం నుంచి జేసీబీ, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలోని యాలాల మండలంలో గుప్తనిధుల త్రవ్వకాల ఘటన తీవ్ర కలకలం రేపింది. బండమీదిపల్లి మరియు జుంటిపల్లి శ్రీరాములవారి ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఒక పురాతన ఆలయం వద్ద కొందరు వ్యక్తులు గుప్తనిధుల కోసం అర్ధరాత్రి సమయంలో ఏకంగా జేసీబీతో త్రవ్వకాలు చేపట్టారు.స్థానికుల నుంచి అందిన పక్కా సమాచారంతో యాలాల పోలీసులు అర్ధరాత్రి దాదాపు 12 గంటల ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన ముఠా సభ్యులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా, ఆరుగురు వ్యక్తులను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనలో పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన వారిలో అక్కంపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ భర్తతో పాటు మరొక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూడా ఉన్నట్లు సమాచారం. నిందితులు గుప్తనిధుల కోసం పురాతన ఆలయ పరిసరాలను ధ్వంసం చేయడానికి తెగబడ్డారు. ఘటనా స్థలం నుంచి త్రవ్వకాలకు ఉపయోగిస్తున్న ఒక జేసీబీ తో పాటు రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకుని యాలాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Sangma: మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్
Varanasi: వారణాసి సినిమాలోకి హాలీవుడ్ హీరోయిన్
చిరు – సింగీతం సినిమా.. మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే
Aggipette Macha: ఆ అమాయకపు తింగరి కోపం చెదిరిపోయింది.. ఆ మహామ్మారే బలితీసుకుంది
