Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్
భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలతో ప్రేక్షకులను నవ్వించిన ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ మూడో సీజన్‌తో మరోసారి రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఫుల్ కామెడీ, రిలేషన్‌షిప్ డ్రామా, ఫాంటసీ అంశాలతో ఆకట్టుకుంటోంది. ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూన్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సేవ్ ది టైగర్స్! తమ భార్యల కారణంగా భర్తలు ఎలా సఫర్ అయ్యారు అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కిన సిరీస్. ఇప్పటికే రెండు సీజన్స్ వచ్చిన ఈ సిరీస్… మాంచి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందర్నీ తెగ నవ్వించేసింది. ఇప్పుడు ఈ సిరీస్ కి కొనసానింగపుగానే మరో సిరీస్ వస్తోంది. అదే సేవ్ ది టైగర్స్ సీజన్ 3. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సిరీస్ ట్రైలర్ కూడా ఇప్పుడు అందర్నీ ఆకట్టుకంటూనే సీజన్ 3 పై విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ కూడా అవుతోంది. సేవ్ ది టైగర్స్ సీజన్ 3ని కూడా మహి వి రాఘవే క్రియేట్ చేశారు. ఇదుంలోనూ ప్రియదర్శి, అభినవ్ గోమతం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. భార్యాబాధితులైన ముగ్గురు మిత్రుల కథతో సాగే ఈ సిరీస్ మూడో సీజన్ ట్రైలర్ మునుపటి కంటే మరింత ఫన్, ఫ్రస్ట్రేషన్‌తో ఆకట్టుకుంటోందిప్పుడు. ఫుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఈ మూడో సీజన్‌ను నెక్ట్స్ లెవెల్లో రూపొందించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. హాట్ స్టార్‌లో జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరుగుతుందని అర్థం అవుతోంది. ట్రైలర్ కాస్త కన్ఫ్యూజింగ్‌గానే ఉన్నా కామెడీ మాత్రం కన్ఫామ్‌గా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఫాంటసీ అంశాలతో రిలేషన్ షిప్ డ్రామాను మిక్స్ చేసి మూడో సీజన్‌ను వినోదభరితంగా తెరకెక్కించారనిపిస్తోంది.మరి సీజన్ 1 అండ్ 2 లాగే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 అందర్నీ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. రెహమాన్
Janhvi Kapoor: దీపికాకు జాన్వీ సాలిడ్ కౌంటర్.. టాలీవుడ్ గురించి వాగితే ఇట్లే ఉంటది!
Satyadev: ‘రాజకీయాల గురించి మాట్లాడితే సినిమాకే పెద్ద నష్టం! నోరు మూసుకోవడం బెటర్!
24 గంటల్లో 47,460 మొక్కలు!.. ప్రకృతి కోసం గిన్నిస్ రికార్డు సృష్టించిన పర్యావరణ యోధుడు
