RK Roja: నా చిన్నారి అన్షు.. ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగింది !! రోజా ఎమోషనల్..
అర్కే రోజా కూతురు అన్షు మాలిక అరుదైన ఘనత సాధించింది. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో అత్యున్నత గౌరవాలతో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసింది. 'హెర్మన్ బి వెల్స్ అవార్డు' అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా రికార్డు సృష్టించింది. పలు అంతర్జాతీయ అవార్డులు కూడా పొందిన అన్షు విజయాలపై రోజా ఆనందం వ్యక్తం చేసింది.
సీనియర్ నటి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉన్నత చదువులు అభ్యసిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా రాణిస్తోంది అన్షు. అలాగే రైటర్ గానూ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు పుస్తకాలు కూడా రాసింది. అలాగే అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ లు కూడా చేసింది. ఇదిలా ఉంటే గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోన్న అన్షు ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హయ్యెస్ట్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఈ డిగ్రీతో పాటు యూనివర్సిటీ ఏటా ఒక్కరికి మాత్రమే ప్రదానం చేసే హెర్మన్ బి వెల్స్ అవార్డును కూడా అందుకుంది అన్షు. దీంతో తన కూతురిని చూస్తూ తెగ సంబరపడిపోతోంది అన్షు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. తన కూతురి గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. “నా కూతురు అన్షు.. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని హయస్ట్ డిస్టింక్షన్‌తో పూర్తి చేసింది. ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మమైన హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్ సీనియర్ అవార్డ్‌ని అందుకుని ఈ గౌరవం సాధించిన తొలి భారతీయ విద్యార్థిగా అన్షు నిలిచింది. గ్రాడ్యుయేషన్ కాలంలోనే అన్షు.. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, ఔట్ స్టాండింగ్ స్టూడెంట్ లీడర్ CEW & T 2026, అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు, పలు డీన్స్ లిస్ట్ గౌరవాలు, అలానే ఫౌండర్స్ స్కాలర్ గుర్తింపు లాంటి పురస్కారాలను అందుకుంది. కూతురు కష్టపడి నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించడం కంటే తల్లికి గొప్ప బహుమతి మరొకటి లేదు. నా చిన్నారి అన్షు.. ఈ మదర్స్ డేని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేకమైన రోజుగా మార్చావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది రోజా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ashu Reddy: నీ మరణ వార్తను నమ్మలేకపోతున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి
