RGV in AP Politics: ఏపీ పాలిటిక్స్‌లోకి వర్మ..! ఇక మామూలుగా ఉండదు గా..! సెటైరికల్ కామెంట్స్.. (వీడియో)

|

Oct 27, 2021 | 4:14 PM

ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేయడం ఆయన నైజం.. ట్వీట్లతో రచ్చ చేయడం.. ఆయనకున్న గొప్పతనం.. ఏదేని ఒక బర్నింగ్ టాపిక్‌ను వ్యగ్యంగా చెప్పడం.. అవసరమైతే మరో లెవల్లో ఇష్యూ అయ్యేలా చేయడం ఆయనకే సాధ్యమైన తుంటరి తనం..! ఇంతీక ఆయనెవరు? ఆయనే మిస్టర్‌ ఆర్జీవీ.

ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేయడం ఆయన నైజం.. ట్వీట్లతో రచ్చ చేయడం.. ఆయనకున్న గొప్పతనం.. ఏదేని ఒక బర్నింగ్ టాపిక్‌ను వ్యగ్యంగా చెప్పడం.. అవసరమైతే మరో లెవల్లో ఇష్యూ అయ్యేలా చేయడం ఆయనకే సాధ్యమైన తుంటరి తనం..! ఇంతీక ఆయనెవరు? ఆయనే మిస్టర్‌ ఆర్జీవీ.మాటలతో తక్కువ.. ట్విట్టర్‌ కూతలతో ఎక్కువగా… ఎఫెక్టివ్‌గా మాట్లాడే ఆర్జీవీ మరో సారి.. తన స్టైల్ ఆఫ్ కమెంట్లతో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ సారి ఏకంగా ఏపీ రాజకీయ నాయకులను కదిపే ప్రయత్నం చేశారు.

తెలుగు దేశం పార్టీ నేత పట్టాభి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అభిమానులు ఆందోళ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. అంతే కాదు జగన్ పై వ్యాఖ్యలు చేసిన పట్టాభిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. అయితే ఈ వ్యవహారం పై ఆర్జీవీ తాజాగా తనదైన శైలిలో ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రాజకీయ నాయకులంతా బాక్సింగ్, కరాటే, కర్రసాము వంటివి నేర్చుకోవాలి అంటూ వర్మ సెటైర్లు వేశారు. ఇక వర్మ ట్వీట్ నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సారి వర్మ చెప్పిన దాంట్లో నిజముందబ్బా అని కమెంట్లు చేస్తున్నారు. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

China-Lockdown-Coronavirus: చైనాలో లాక్‌డౌన్‌…భారత్‌లో భయాందోళన.. మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..(లైవ్ వీడియో)