RGV: ఆ స్టార్‌పై నాకు కోపం, ద్వేషం.. RGV ఎమోషనల్ ట్వీట్
మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘Michael’ చూసిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. 2009లో జాక్సన్ మరణ వార్త విన్న రోజు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. “మైఖేల్ చనిపోవడంతో అతడూ సాధారణ మనిషేనని తెలిసింది” అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సాధారణంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ప్రతి చిన్న విషయం గురించి తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. తాజాగా గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్, దివంగత కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ గురించి ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఫరా ఖాన్, అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు భారతీయ సెలబ్రిటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కాగా, మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘Michael’ చూసిన తర్వాత ఆర్జీవీ ఎమోషనల్ అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగభరితమైన నోట్‌ను పంచుకున్నారు. అందులో తనకు మైఖేల్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 2009 జూన్ 25న మైఖేల్ జాక్సన్ మరణించిన ఆ చేదు జ్ఞాపకాన్ని వర్మ గుర్తు చేసుకున్నారు. “నాకు మైఖేల్ అంటే అసహ్యం. మైఖేల్ సినిమా చూసిన తర్వాత, నాకు ఆ భయంకరమైన రోజు గుర్తుకొచ్చింది. అవును.. 2009 జూన్ 25న ఆ ఘోరమైన రోజు ఉదయం నిద్ర లేవగానే టీవీ స్క్రీన్‌పై వస్తున్న వార్త చూసి షాక్ అయ్యాను. మొదట అదొక పీడకల అనుకున్నాను, ఇలాంటి దారుణమైన కల నాకు ఎందుకు వస్తుందని భావించాను. కానీ టీవీలో స్క్రోలింగ్ మారుతూనే ఉంది. వేరే ఛానల్స్ మార్చి చూసినా అందరూ అదే గంభీరమైన స్వరంతో జాక్సన్ మరణ వార్తను చదువుతున్నారు. అప్పుడే నమ్మశక్యం కాని నిజం జరిగిపోయిందని నాకు అర్థమైంది. మైఖేల్ జాక్సన్ చనిపోవడం వల్ల.. అతను కూడా మనలాంటి సాధారణ మనిషే అని నాకు తెలిసి వచ్చింది. అలా అర్థాంతరంగా చనిపోయినందుకే నాకు అతడిపై కోపం, ద్వేషం” అంటూ వర్మ ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. లక్ష క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన శునకం..!
Randeep Hooda: ఆ సినిమాలో ఇరుక్కుని.. మరిన్ని ఇబ్బందులు పడాలనుకోలేదు
Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. ఏది అడిగినా ఇచ్చేస్తా
చరిత్ర సృష్టించిన ఆకలి.. రెండు పిజ్జాల ధర రూ.7,400 కోట్లా
రోడ్ కిందే చార్జింగ్ పాయింట్స్ ! రన్నింగ్ వెహికిల్‌కు క్షణాల్లో ఛార్జింగ్.!
