బాక్సాఫీస్ దగ్గర లోకల్ నేటివిటీ ట్రెండ్
టాలీవుడ్లో ప్రాంతీయ కథలకు ఆదరణ పెరుగుతోందనే చర్చకు తాజా బాక్సాఫీస్ ఫలితాలు బలం చేకూరుస్తున్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ‘రణబాలి’ సీడెడ్‌లో మంచి వసూళ్లు సాధించిందని, గరివిడి లక్ష్మి జీవిత కథకు ఉత్తరాంధ్ర ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోందని కథనం పేర్కొంటోంది. తెలంగాణ నేపథ్య చిత్రాలైన ‘బలగం’, ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ నైజాంలో ఆదరణ పొందాయని చెబుతోంది. స్థానిక యాస, సంస్కృతి ప్రేక్షకులను కథతో మరింతగా అనుసంధానిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టాలీవుడ్లో ఇప్పుడు పక్కా నేటివిటీ ట్రెండ్ నడుస్తోంది. ఏ ప్రాంతం నేపథ్యంలో సినిమా తెరకెక్కితే.. ఆ ఏరియా ఆడియన్స్ ఆ సినిమాను ఫుల్‌గా ఓన్ చేసుకుంటున్నారు. మిగతా ఏరియాలతో సంబంధం లేకుండా తమ ప్రాంతపు కథలను ముందుగా తామే భుజాన మోస్తూ హిట్ చేస్తున్నారు. రీసెంట్ బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఈ లోకల్ సెంటిమెంట్ వసూళ్ల పరంగా ఎంత బలంగా వర్కవుట్ అవుతోందో క్లియర్‌గా అర్థమవుతోంది. సాధారణంగా సినిమా కంటెంట్ బాగుంటే ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో ఆదరిస్తారని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. కానీ రీసెంట్ బాక్సాఫీస్ రిజల్ట్స్ మాత్రం మరో కొత్త ట్రెండ్‌ను చూపిస్తున్నాయి. ఏ ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమాలు ఆ ఏరియాలోనే ముందుగా బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కరువు నేపథ్యంలో తెరకెక్కిన రణబాలి సినిమానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వచ్చినా.. సీడెడ్ ప్రాంతంలో మాత్రం వసూళ్ల వర్షం కురిపించి అందరికంటే ముందే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకుంది. సీడెడ్ మాత్రమే కాదు.. ఉత్తరాంధ్రలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథతో గుర్తింపు తెచ్చుకున్న కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాకు ఆ ప్రాంతంలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తమ ప్రాంతపు కళాకారిణి బయోపిక్ కావడంతో ఉత్తరాంధ్ర ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలైతే నైజాం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. బలగం, దసరా సినిమాలతో పాటు ది ప్యారడైజ్ కూడా నైజాంలోనే భారీ వసూళ్లు సాధించింది. లోకల్ యాస, కల్చర్ తెరపై కనిపించడంతో నైజాం ఆడియన్స్ ఈ సినిమాలకు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సినిమాలన్నీ నైజాం ఏరియాలోనే ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యాయి. మొత్తానికి కంటెంట్ బాగుంటే అందరూ చూస్తారనే మాట నిజమే అయినా.. ఆడియన్స్ మాత్రం తమ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారని రీసెంట్ కలెక్షన్స్ తేల్చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Honey: తేనె అంటే వాంతేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
రిటైర్మెంట్ జీవితానికి బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే.. భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!