Ramayana: మార్చి నుంచి రామాయణ నయా షెడ్యూల్‌

Edited By:

Updated on: Mar 10, 2026 | 4:39 PM

రామాయణం సినిమా నిర్మాణం ఊహించని వేగంతో జరుగుతోంది. రణ్‌బీర్ కపూర్, యష్ తమ కాల్‌షీట్లను ముందుగానే కేటాయించడంతో, షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగా పుంజుకుంది. ఈ దీపావళికి పార్ట్ 1, వచ్చే దీపావళికి పార్ట్ 2 విడుదల లక్ష్యంగా మేకర్స్ దూసుకుపోతున్నారు. పౌరాణిక చిత్రాలకు ఇంత వేగం అరుదు.

అన్నీ కలిసొస్తే అనుకున్నదానికన్నా స్పీడ్‌ పెరుగుతుందంటారు. అంతా పాజిటివ్‌ వైబ్‌ కనిపిస్తుందంటారు. ఇప్పుడు రామాయణ విషయంలో దాన్నే విట్‌నెస్‌ చేస్తున్నారు నార్త్ జనాలు. మామూలుగా భారీ ప్రాజెక్టుల్లో షెడ్యూల్స్ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే అద్భుతం జరిగినట్టే.. అలాంటిది అనుకున్నదానికన్నా ముందు జరిగితే.. ఈ థాట్‌ ఎవరికీ రాదనే అనాలి. అలాంటిది రామాయణ విషయంలో సాధ్యపడుతోందా? డీటైల్స్ చూద్దాం.. మైథలాజికల్‌ సినిమాలకు టైమ్‌ ఎక్కువ కావాలి. ప్రీ ప్రొడక్షన్‌కే కాదు.. పోస్ట్ ప్రొడక్షన్‌కి కూడా ఊహించనంత సమయం పడుతుందన్నది ఇప్పటి వరకు మనం గమనించిన విషయం. అయితే వాటన్నిటినీ పక్కాగా అంచనా వేసుకుని ఈ దీపావళికి ఫస్ట్ పార్టునీ, వచ్చే దీపావళికి సెకండ్‌ పార్టునీ రిలీజ్‌ చేస్తామని చెప్పేశారు రామాయణ మేకర్స్. ఏడాది గ్యాప్‌తో రెండు పార్టులు రావడం సాధ్యమేనా? అనే చర్చ ఆల్రెడీ ఉంది. ఈ మే నుంచి సీక్వెల్‌ కోసం రణ్‌బీర్‌ కపూర్‌ సెట్ కి రావాలన్నది ఇనిషియల్‌ ప్లాన్‌. కానీ ఇప్పుడు మార్చి నుంచే సీక్వెల్‌ షూట్‌లో ఉంటారట రణ్‌ బీర్‌. సంజయ్‌ లీలా భన్సాలీ హెల్త్ ఇష్యూస్ తో లవ్‌ అండ్‌ వార్‌ షూట్‌ మే తర్వాతకి పోస్ట్ పోన్‌ అయిందట. దాంతో ఆ కాల్షీట్‌ రామాయణ మేకర్స్ కి ఇచ్చేశారు రణ్‌ బీర్‌. టాక్సిక్‌ వాయిదా పడటంతో, ఆ మూవీ ప్రమోషన్ల కోసం అలాట్‌ చేసిన కాల్షీట్‌ ని కూడా యష్‌ ఇప్పుడు రామాయణకే ఇస్తున్నారట. సో, రామ – రావణ – హనుమంతుడి మధ్య వచ్చే సన్నివేశాలను మే లోపు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే

Follow Us