రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

Updated on: Feb 14, 2026 | 9:09 AM

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు తెలిపారు. జనవరి 31న వీరికి కవలలు బాబు, పాప జన్మించారు.

ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సెలబ్రిటీలకు పిల్లలు పుడితే వారికి ఎలాంటి పేర్లు పెడతారా అని, వాటి అర్థం ఏం ఉంటుందా అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. రామ్‌చరణ్‌ ఈ పేర్ల వెనుక ఉన్న అర్థాలను, వాటి ప్రాముఖ్యతను వివరించారు. కుమారుడి పేరు ‘శివరామ్‌’లో శివుడు, రాముడితో పాటు తన తండ్రి చిరంజీవి అసలు పేరు ‘శివ శంకర వరప్రసాద్’ కూడా కలిసి ఉందని చెప్పారు. కుమార్తె పేరు ‘అన్విరా దేవి’కి అపరిమితమైన ధైర్యం, దైవికమైన స్త్రీ శక్తి అని అర్థం వచ్చేలా పెట్టామని రామ్‌చరన్‌ అన్నారు. తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో, వారి భాగస్వామ్యంతో ఈ పేర్లను సెలెక్ట్‌ చేసామని రామ్‌ చరణ్ తెలిపారు. 2023లో జన్మించిన క్లింకారా తర్వాత, చరణ్-ఉపాసన దంపతులకు శివరామ్, అన్విరా రెండో, మూడో సంతానం.

Loading...
Unable to load recommendations.
Follow Us