RC 17: మరో ట్విస్ట్ ఇచ్చిన ఆర్సీ 17 టీమ్
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న RC17పై ఆసక్తికర అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమైన ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభమై, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశముందని సమాచారం. హీరోయిన్ రేసులో అనస్వర రాజన్, సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లు వినిపిస్తుండగా, సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా అనిరుధ్ పేరు తెరపైకి వచ్చింది.
రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఆర్సీ 17. అనౌన్స్‌మెంట్ నుంచే పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ రివీల్ అయ్యాయి. అసలు ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? ఈసారి సుక్కు వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్న ఆ క్రేజీ స్టార్స్ ఎవరు? అన్న డిటైల్స్ మీద మీరు కూడా ఓ లుక్కేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీ పూజా కార్యక్రమాలను అక్టోబర్‌లోనే ప్లాన్ చేసినా, ప్రీ-ప్రొడక్షన్ పనుల వల్ల కాస్త ఆలస్యమవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నవంబర్‌లో గ్రాండ్‌గా ప్రారంభించే ప్లాన్‌తో ఉంది మూవీ టీమ్. డిసెంబర్ నుంచి గ్యాప్ లేకుండా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా సుకుమార్ పక్కాగా షెడ్యూల్స్ లాక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నటించబోయే ఆ లక్కీ బ్యూటీ ఎవరన్న విషయంలో ఇంట్రెస్టింగ్ నేమ్స్ వినిపిస్తున్నాయి. అనస్వర రాజన్, సారా అర్జున్ లాంటి పేర్లు తెర మీదకు వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్‌లో సైయ్యార బ్యూటీ అనీత్ పడ్డా పేరు కూడా వినిపిస్తోంది. హీరో క్యారెక్టర్‌తో పాటు హీరోయిన్ రోల్‌కు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉండటంతో మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లోనూ డీఎస్పీ పేరే కనిపించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పేరు తెరపైకి వచ్చింది. పాన్ ఇండియా అప్పీల్, ఫ్రెష్ సౌండింగ్ కోసం మేకర్స్ అనిరుధ్‌ను రంగంలోకి దించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..
Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ
Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్
ఒక్కో ఇన్విటేషన్ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?
Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!