సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

Updated on: Jun 12, 2026 | 10:30 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రకటించిన తలైవా 173 సినిమాకు సంబంధించిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. ప్రారంభంలో దర్శకుల మార్పుల వల్ల ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తినప్పటికీ, ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. కమల్ హాసన్ నిర్మాతగా, మొదట సుందర్. సి దర్శకత్వంలో ప్రకటించిన ఈ చిత్రం నుండి సుందర్. సి తప్పుకున్నారు. ఆ తర్వాత సిబి చక్రవర్తిని దర్శకుడిగా ప్రకటించినా, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు.

చివరగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తలైవా 173 పట్టాలెక్కడం ఖరారైంది. ఇప్పటికే సినిమా సెట్ వర్క్ ప్రారంభమైంది. జైలర్ 2 షూటింగ్ పూర్తయైన వెంటనే ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సినిమా కథ విషయంలో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. రజినీకాంత్ ఇందులో ఐదు రూపాయల డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని తాజా సమాచారం. అయితే, జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇదే ఐదు రూపాయల డాక్టర్ కథతో సూర్య కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. దీంతో రజినీకాంత్ ప్రాజెక్ట్, సూర్య ప్రాజెక్ట్ మధ్య ఒకే కథ అనే అంశం డైలమాలో పడింది. ఈ విషయంలో మరింత స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం :

బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్

ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?

మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు

మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

Loading...
Unable to load recommendations.
Follow Us