విడిపోయాకే సంతోషంగా ఉన్నా.. బాధ లేని బంధం

Updated on: Feb 13, 2026 | 11:46 AM

కోలీవుడ్ దర్శకుడు ఆర్. పార్తీబన్‌ తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి సీతతో విడిపోయిన తర్వాత తానెప్పుడూ బాధపడలేదని, పైగా సంతోషంగా ఉన్నానని తెలిపారు. 12 ఏళ్ల బంధం మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. నేటి తరం వివాహం కంటే స్వాతంత్ర్యానికే ప్రాధాన్యత ఇస్తుందని, పరిమితులు లేని జీవితాన్ని కోరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్‌ తన విడాకులు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన.. నటి సీతను పెళ్లాడిన దాదాపు 12 ఏళ్ల తర్వాత.. ఆమెతో విడిపోయానంటూ చెప్పుకొచ్చాడు. అయితే సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని.. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. తనతో ఉన్న 12 సంవత్సరాలు.. తన జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్‌ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్తీబన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో ఆ సినిమాలకు కష్ట కాలం.. పాపం

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్

యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..

Loading...
Unable to load recommendations.
Follow Us