OTTలో మెంటలెక్కించే క్రైమ్‌ థ్రిల్లర్ ఈ సినిమా ఎలా ఉందంటే…?

Updated on: Oct 09, 2026 | 4:51 PM

పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్‌’ ఓటీటీలోకి వచ్చేసింది. షహద్‌ నీలాంబూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ చూసే అవకాశం ఉంది. పోలీసులే నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం, సీనియర్‌ అధికారి దర్యాప్తు చేయడం ఈ కథలో ఆసక్తికరమైన అంశాలు.

మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ మలయాళ చిత్రాలను ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటారు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే ఎగబడి ఈ సినిమాలను చూస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.8 రేటింగ్ తెచ్చుకుంది. ఆ సినిమానే పార్వతీ లీడ్‌ రోల్లో యాక్ట్ చేసిన ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్. ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్.! ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కారుణ్య నియామకం కింద పోలీస్‌ ఉద్యోగం సంపాదించిన అలీనా అబ్రహాం అలియాస్ పార్వతి తిరువోతు చుట్టూ ఈ కథ సాగుతుంది. ఓ పోలీస్‌ స్టేషన్‌లో రాత్రి విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసుల చేతుల్లో అనుకోకుండా ఓ నేరం జరుగుతుంది. అయితే నేరాన్ని బయటకు రాకుండా చేసేందుకు అదే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు తమకున్న తెలివితేటలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. క్రైమ్‌ సీన్‌ గురించి, పోలీస్‌ శాఖలోని విధివిధానాల గురించి పూర్తిగా తెలిసిన వారు కావడంతో.. ఆధారాలు దొరకకుండా నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీనియర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి విజయరాఘవన్‌ చేపడతారు. దీంతో నేరానికి పాల్పడిన పోలీసులకు, దర్యాప్తు అధికారికి మధ్య మైండ్ గేమ్ నడుస్తుంది? మరి ఎవరికి తెలియకుండా చేసిన నేరాన్ని పోలీసులు ఎలా దాచారు? విజయరాఘవన్‌ వారికి ఎలా చెక్‌ పెట్టారు? చివరికి అసలు నిజం ఎలా బయటపడింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన షహద్ నీలాంబూర్ ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ సినిమాను తెరకెక్కించాడు. 11 ఐకాన్స్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ సెల్వా నిర్మించిన ఈసినిమాకు పి.ఎస్. సుబ్రమణియన్, విజేష్ తోట్టింగల్ స్క్రిప్ట్ అందించారు. ముజీబ్ మజీద్ నేపథ్యం సంగీతం సమకూర్చారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 05 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు.. హోంగార్డ్ ఈవెంట్స్‌లో అదరగొట్టిన మహిళ

రెండో అంతస్తునుంచి పడిపోయిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు!

ఏఐతో పెను ప్రమాదం తప్పదు.. ఓపెన్‌ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా

ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..

విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన కరెంట్‌ ఛార్జీలు

Loading...
Unable to load recommendations.
Follow Us