Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్
ప్రభాస్ ఇకపై దర్శకుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గతంలో చిన్న దర్శకులను సైతం నమ్మి సినిమాలు చేసిన డార్లింగ్, 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'రాజా సాబ్' వంటి ఫలితాలతో గుణపాఠం నేర్చుకున్నారు. ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి పెద్ద దర్శకులతో వచ్చిన విజయాల తర్వాత, ప్రభాస్ భారీ ప్రాజెక్టులకు రిస్క్ తీసుకోవడం తగ్గించి, పేరున్న దర్శకులతోనే పని చేయాలని భావిస్తున్నారు.
మంచితనాకి అయినా.. నమ్మకానికైనా.. దేనికైనా.. ఓ లిమిట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఇంత వరకు లిమిట్ లెస్ గా ఉంటూ వచ్చిన డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు లిమిట్ పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారట. డైక్టర్లను గుడ్డిగా నమ్మకుండా.. కాస్త చూసుకుని… లెక్కలేసుకుని సినిమా చేయాలని అనుకుంటున్నారట. అంత మార్కెట్ ఉన్నా.. దర్శకుల విషయంలో మాత్రం ఎప్పుడూ పట్టుదలకు పోలేదు ప్రభాస్. కథ నచ్చితే చిన్న దర్శకులకు కూడా ఛాన్సిచ్చారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రశాంత్ నీల్ మినహా.. ఆయన పని చేసిన దర్శకులంతా మీడియం రేంజే. బాహుబలి లాంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా తీసిన సుజీత్‌ను నమ్మి సాహో చేసారు ప్రభాస్. ఆయన నమ్మకం తెలుగులో నిలబడకపోయినా.. హిందీలో వర్కవుట్ అయింది. ప్రభాస్ ప్యాన్ ఇండియా మార్కెట్ పెరగడంలో సాహో బాగా హెల్ప్ అయింది. కానీ ఆ తర్వాతే ఏ దర్శకుడూ ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. జిల్ ఫ్లాపైనా.. రాధాకృష్ణ కుమార్ చెప్పిన కథ నచ్చి రాధే శ్యామ్ చేసారు ప్రభాస్. అది డిజాస్టర్ అయింది.. ఆ తర్వాత ఓం రౌత్‌ను నమ్మి ఆదిపురుష్ చేసి విమర్శల పాలయ్యారు. నాగ్ అశ్విన్ మాత్రమే ప్రభాస్ నమ్మకం వమ్ము చేయకుండా.. కల్కితో 1000 కోట్ల సినిమా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ సైతం సలార్‌తో అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చారు. మొన్న రాజా సాబ్‌తో మరోసారి ప్రభాస్‌కు షాక్ తప్పలేదు. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన మారుతిని నమ్మి రాజా సాబ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రభాస్.. కానీ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే ఇకపై భారీ ప్రాజెక్ట్స్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు ప్రభాస్ సిద్ధంగా లేరని తెలుస్తుంది. ప్రస్తుతం రెబల్ స్టార్ చేస్తున్న కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ అన్నీ పేరున్న దర్శకులతోనే..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
‘నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు’ స్టార్ హీరోయిన్ ఆవేదన
Rajinikanth: మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్ గురూ..!
Nagarjuna: ‘ధురంధర్’లో విలర్ ఛాన్స్ మిస్ !! నాగార్జున రియాక్షన్
