Prabhas: డార్లింగ్ బర్త్‌డే మీద అభిమానుల ఆశలు.. సలార్‌ 2 అప్‌డేట్ ఉంటుందా..?

Edited By:

Updated on: Oct 07, 2026 | 10:22 PM

ప్రభాస్‌ బర్త్‌డే మంత్‌ ప్రారంభం కావడంతో అభిమానుల్లో సందడి మొదలైంది. అక్టోబర్‌ 23న ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ సినిమాల నుంచి అప్‌డేట్స్‌ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ‘ఫౌజీ’ నుంచి టీజర్‌, ‘స్పిరిట్‌’ నుంచి ప్రభాస్‌ పోలీస్‌ లుక్‌, ‘కల్కి 2’పై ప్రత్యేక ప్రకటనతో పాటు ‘సలార్‌ 2’ షూటింగ్‌పై క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

బర్త్‌డే మంత్ స్టార్ట్ అవ్వటంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉండటంతో, బర్త్‌డే సందర్భంగా బాక్సాఫీస్ షేక్ అయ్యే సర్‌ప్రైజ్‌లు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏకంగా నాలుగు సినిమాల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌ను అలరించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ నుంచి వీడియో అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఈ బర్త్‌డేకి ఫౌజీ సినిమా నుంచి టీజర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. డార్లింగ్ అభిమానులను ఊరిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ పోలీస్ గెటప్‌పై భారీ హైప్ ఉండటంతో, బర్త్‌డే రోజున స్పిరిట్ నుంచి డార్లింగ్ న్యూ లుక్ రివీల్ చేసే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’ పై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రభాస్ ఇంకా సీక్వెల్ షూటింగ్‌లో జాయిన్ అవ్వకపోయినా బర్త్‌ డే సందర్భంగా అప్‌డేట్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అందుకే అభిమానుల కోసం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చే ఆలోచనలో ఉంది నాగీ టీమ్‌. ఇవి మాత్రమే కాదు సలార్ 2 షూటింగ్‌క సంబంధించిన క్లారిటీతో పాటు డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న మరికొన్ని సినిమాల విషయంలోనూ అక్టోబర్ 23న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌ . మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు

Loading...
Unable to load recommendations.
Follow Us