వేసవిలో లక్‌ టెస్ట్ కి రెడీ అవుతున్న మృణాల్‌ – పూజా

Edited By:

Updated on: Apr 12, 2026 | 6:31 PM

పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ బాలీవుడ్ చిత్రం 'హై జవానీతో ఇష్క్ హోనా హై'పై భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రం వారి కెరీర్‌కు కీలకంగా మారింది. మేకర్స్ ముందుగా నిర్ణయించిన జూన్ 12 కంటే మే 22న సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సమ్మర్‌లో ఈ సినిమాతో ఇద్దరు నాయికలకు మంచి బ్రేక్ వస్తుందని అంచనా.

కొన్నిసార్లు ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రాజెక్టులు అనుకున్నంత గొప్పగా సక్సెస్‌ కావు. అలాంటప్పుడు, అనూహ్యంగా ఇంకేదో సబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది. కెరీర్‌ సెటిల్‌గా ఉండటానికి సహకరిస్తుంది. ఇప్పుడు పూజా అండ్‌ మృణాల్‌.. ఇద్దరి విషయంలోనూ ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్ భుజం కాయనుందా? రెట్రో తర్వాత మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్‌ చేస్తున్నారు పూజా హెగ్డే. ఈ ఏడాది ‘జననాయగన్‌’తో ఫెస్టివ్‌ బిగినింగ్‌ ఉంటుందనుకున్నారు. ఆ సినిమా సెన్సార్‌కారణాలతో వాయిదా పడటం, ఇప్పుడు లీకుల పర్వం కొనసాగుతుండటంతో రిలీజ్‌ ఎప్పుడుంటుందో కరెక్ట్ గా చెప్పలేని సిట్చువేషన్‌. అందుకే బాలీవుడ్‌ మూవీ ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’లో వరుణ్‌ధావన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్‌ 12న థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అయితే, అనుకున్న తేదీ కన్నా మూడు వారాల ముందు.. అంటే మే 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. సో ఈ సమ్మర్‌లో జనాల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు జిగేల్‌ రాణి. హై జవానీతో ఇష్క్ హోనా హై’తో మరో నాయికగా నటిస్తున్నారు మృణాల్‌ ఠాకూర్‌. ఈ సమ్మర్‌కి ‘డెకాయిట్‌’తో ఆల్రెడీ బోణీ కొట్టేశారు. సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చిన శేష్‌ కెరీర్‌లో ది బెస్ట్ డే ఒన్‌ కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు మేకర్స్. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ కేరక్టర్‌ మృణాల్‌కి మంచి పేరే తెచ్చిపెట్టింది. త్వరలోనే అల్లు అర్జున్‌తో మృణాల్‌ కనిపిస్తారనే టాక్‌ ఉంది. ఆక్షణాల కోసం తాను కూడా వెయిట్‌ చేస్తున్నానని చెప్పేశారు మృణాల్‌. ఈ ముచ్చట్ల సంగతి కాసేపు పక్కనపెడితే బాలీవులో మేలో రిలీజ్‌ అయ్యే ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మూవీ కోసం మృణాల్‌ కూడా ఈగర్‌గానే వెయిటింగ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

Follow Us