Peddi: నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే భారీ ధరకు పెద్ది రైట్స్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా టీజర్‌లకు అద్భుత స్పందన రావడంతో, నెట్‌ఫ్లిక్స్ రికార్డు స్థాయిలో ₹150 కోట్లకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది. ఇది ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద డీల్‌గా నిలిచింది. చరణ్ పాన్ ఇండియా క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకుని నెట్‌ఫ్లిక్స్ ఈ భారీ మొత్తం చెల్లించింది, టాలీవుడ్, బాలీవుడ్‌లను ఆశ్చర్యపరిచింది.
క్రికెట్ ఆటగాడిగా… కుస్తీ వీరుడిగా.. ఇప్పటి వరకు పెద్ది నుంచి రిలీజ్ అయిన టీజర్స్ దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పెద్ది పై ఎక్కడ లేని అంచనాలను పెంచేశాయి. అయితే ఈ అంచనాలతో పాటు.. పాన్ ఇండియా మార్కెట్‌లో చరణ్ సినిమాకు ఉన్న క్రేజ్‌ను బేరీజు వేసుకున్న ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు దిమ్మతిరిగే రేట్ కోట్ చేసిందట. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే ఏ హీరోకు ఇవ్వనంత పెద్దికి ఇచ్చేందుకు ఓకే చెప్పిందట. చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరెకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. వరల్డ్ వైడ్ ఏప్రిల్ 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్.. రికార్డ్ లెవల్లో ఏకంగా 130 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందట. అంతేకాదు పెద్ది సినిమా థియేటర్లలో సూపర్ డూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటే మరో 20 కోట్ల రూపాలయను కూడా అదనంగా ఆఫర్ చేసేందుకు ఓకే చెప్పిందట నెట్‌ఫ్లిక్స్. అంటే మొత్తంగా పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 150 కోట్ల ఖర్చు చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్. అయితే ఓటీటీ హిస్టరీలోనే పెద్దిదే బిగ్ డీల్ అట. దీంతో టాలీవుడే కాదు.. బాలీవుడ్ కూడా పెద్ది ఓటీటీ డీల్ గురించి అవాక్కయ్యేలా మాట్లాడుతకుంటున్నట్టు టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandar 2: కలెక్షన్స్‌పై రివెంజ్‌లా ఉంది పరిస్థితి.. ప్రపంచవ్యాప్త సంచలన వసూళ్లు
Devara – 2: కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే !!
Peddi: పెద్ది మాటే చెల్లకపోతే ఎట్టా !! గందరగోళంగా మారిన పెద్ది రిలీజ్ డేట్
Trisha: ‘పెళ్లైంది.. పిల్లలు కూడా ఉన్నారు’ మరి విజయ్ సంగతేంటి ??
