పాన్ ఇండియా సినిమాల రిలీజ్ గందరగోళం.. చిన్న సినిమాలకూ భారీ దెబ్బ!

Edited By:

Updated on: Aug 03, 2026 | 8:29 AM

పాన్ ఇండియా సినిమాల విడుదలల్లో కొనసాగుతున్న ఆలస్యాలు టాలీవుడ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్లు ఖరారు కాకపోవడంతో థియేటర్ల ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్, చిన్న సినిమాల షెడ్యూల్స్, ఓటీటీ వ్యాపారంపై ప్రభావం పడుతోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్, నిఖిల్, ప్రశాంత్ వర్మ తదితరుల చిత్రాల విడుదల తేదీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రిలీజ్‌ డేట్‌ లాక్ చేసిన సినిమాల పరిస్థితే ఇలా ఉంటే అసలు డేట్‌ లాక్ చేయని సినిమాల నెంబర్‌ కూడా గట్టిగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాలు ప్రకటిస్తున్నారు కానీ… షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ రావటం లేదు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు కాకపోవడంతో ఆ ఎఫెక్ట్‌ థియేటర్ల ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్‌తో పాటు మిగతా సినిమాల రిలీజ్ షెడ్యూల్స్‌పైనా పడుతోంది. పుష్ప 2 తరువాత అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్న అల్లు అర్జున్‌, ఆ సినిమా విషయంలో స్పెషల్ కేర్‌ తీసుకుంటున్నారు. అందుకే బన్నీ సినిమా నెక్ట్స్ ఇయర్‌ ఎండింగ్‌గాని వచ్చేలా లేదు. మరోవైపు రామ్ చరణ్, సుకుమార్‌ సినిమా అయితే ఇంకా స్టార్టే కాలేదు. స్టార్ హీరోలంతా ఏళ్లకేళ్లు టైమ్ తీసుకోవటంతో వెండితెర మీద ఆ గ్యాప్‌ స్పష్టంగా కనిపిస్తోంది. నిఖిల్ చేస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా స్వయంభూ, ప్రశాంత్ వర్మ, రిషబ్‌ శెట్టి సినిమా జై హనుమాన్‌’ ఎప్పుడు వస్తాయో కూడా అర్ధం కావటం లేదు. ప్రొడక్షన్‌ కారణంగానే చాలా డిలే కావటంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ మిస్ అయ్యాయి. ఇప్పటికీ విజువల్‌ ఎఫెక్ట్స్ వర్క్‌ పూర్తి కాకపోవటంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్‌ క్లారిటీ ఇవ్వటం లేదు. సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు, నాగచైతన్య వృషకర్మ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల రిలీజ్ డేట్స్‌ విషయంలోనూ కన్‌ఫ్యూజన్‌ కనిపిస్తోంది. పాన్ ఇండియా టార్గెట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియక ఫ్యాన్స్‌ ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి పాన్ ఇండియా సినిమా ప్రకటించడం కంటే.. అనుకున్న సమయానికి ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా భారీ చిత్రాల రిలీజ్‌లు ఆలస్యం అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద కూడా పడుతోంది. సడన్‌గా ఓ బిగ్ మూవీ రిలీజ్ డేట్‌ ఎనౌన్స్ చేస్తే ఆ డేట్‌కు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలు డేట్ మార్చుకోవాల్సి వస్తోంది. పదే పదే వాయిదా పడటం వల్ల చాలా సినిమాల మార్కెట్, ఓటీటీ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈ పరిస్థితి మారాలంటే మన మేకర్స్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం బెటర్‌ అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!

స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు

OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?

పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!

Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us