డేట్ లాక్ చేసే ప్లాన్‌లో చిరు, నాని.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి..?
పాన్ ఇండియా సినిమాల విడుదల తేదీలపై టాలీవుడ్‌లో మళ్లీ సందిగ్ధత నెలకొంది. చిరంజీవి ‘విశ్వంభర’, నాని ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’, ప్రభాస్ ‘ఫౌజీ’ వంటి భారీ చిత్రాలు కూడా వాయిదాల ఊహాగానాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. అధికారిక ప్రకటనల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ ఈ కన్ఫ్యూజన్ ఇలాగే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు డేట్స్ లాక్ చేస్తున్నాయి. మరికొన్ని సినిమాల విషయంలో డేట్ లాక్ అయినా.. ఆన్ టైమ్ వస్తుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా విశ్వంభర రిలీజ్ డేట్ చెబుతారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనుల్లో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చే ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరో వైపు నేచురల్ స్టార్ నాని కూడా రిలీడ్ డేట్ విషయంలో కన్ఫార్మేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈనెల 6న టీజర్ లాంచ్‌కు మూహూర్తం ఫిక్స్ చేసిన ది ప్యారడైజ్ మూవీ టీమ్, టీజర్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ అప్‌డేట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. దసరా తరువాత అదే కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావటంతో ది ప్యారడైజ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా అప్పీల్ కోసం భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు పదే పదే వాయిదాలు పడుతున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్, ప్రభాస్, హను రాఘవపూడిల ఫౌజీ లాంటి సినిమాలు డేట్స్ లాక్ చేసినా.. ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తుంటే అనుకున్న టైమ్‌కి వస్తాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రాజెక్టులు అనౌన్స్ చేసినప్పుడు ఉన్న స్పీడ్, రిలీజ్ డేట్స్ దగ్గరపడేసరికి కనిపించటం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
OTT కొత్త రూల్స్.. నిర్మాతలకు వరమా? శాపమా?
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
Chicken Manchurian: మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే.. ఏ ఊరిదో తెలుసా?
