రిలీజ్ డేట్స్, ఓటీటీ అగ్రిమెంట్లపై సెన్సార్ ఎఫెక్ట్.. దర్శక నిర్మాతల నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Updated on: Nov 05, 2026 | 11:08 AM

కొత్త సెన్సార్ నిబంధనలు తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్నాయి. రీ-సెన్సార్ షిప్ నిబంధనలు, ఓటీటీ అగ్రిమెంట్ల వల్ల రిలీజ్ డేట్స్, థియేట్రికల్ స్లాట్‌లు తారుమారు అయ్యే ప్రమాదముంది. పెద్ద సినిమాల వందల కోట్ల బిజినెస్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ముందుగానే పక్కా ప్లానింగ్ లేకపోతే నిర్మాతలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సెన్సార్ నిబంధనలు తెలుగు సినీ పరిశ్రమకు అనేక సవాళ్లను విసురుతున్నాయి. గ్రాఫిక్స్, టైటిల్స్ విషయంలోనే కాకుండా, సినిమా వ్యాపారం, విడుదల ప్రణాళికలపై కూడా ఈ మార్పులు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రీ-సెన్సార్ షిప్ నిబంధనలు, ఓటీటీ అగ్రిమెంట్ల విషయంలో నిర్మాతలు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు.పెద్ద సినిమాల విషయంలో సెన్సార్ పూర్తయిన తర్వాత రన్‌టైమ్ సర్దుబాటు కోసం సన్నివేశాలను తొలగించడం లేదా కొత్తవి చేర్చడం గతంలో జరిగేది. అయితే, కొత్త రూల్స్ ప్రకారం ఒకసారి సినిమా సెన్సార్ అయిపోయిన తర్వాత చిన్న మార్పు చేయాలన్నా మళ్లీ మొదటి నుంచి రీ-సెన్సార్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో విడుదలైన తర్వాత మార్పులు చేర్పులు చేయడం అసాధ్యంగా మారింది.అంతకుమించి పెద్ద సమస్య ఓటీటీ ఒప్పందాలతో ముడిపడి ఉంది. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు షూటింగ్ దశలోనే ఓటీటీ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. ఫలానా తేదీకి థియేటర్లలో విడుదల చేస్తామని ముందే అంగీకరించుకుంటున్నాయి. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఫస్ట్ కాపీతో సెన్సార్‌కు వెళ్లి సర్టిఫికెట్ వచ్చేవరకు వేచి చూసి, అప్పుడు విడుదల తేదీని ఖరారు చేయాలంటే, ముందుగా చేసుకున్న ఓటీటీ అగ్రిమెంట్లు, థియేట్రికల్ స్లాట్స్ దెబ్బతినే ప్రమాదముంది.

Loading...
Unable to load recommendations.
Follow Us