Mrunal Thakur: పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌

Updated on: Apr 10, 2026 | 12:51 PM

మృణాల్ ఠాకూర్ 'పెద్ది' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారనే ప్రచారంపై స్పందించడానికి నిరాకరించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైనప్పుడు, ఆమె చాకచక్యంగా దానిని తప్పించుకుంటూ, తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి మాట్లాడారు. ఐటెం సాంగ్ గురించి ధృవీకరించకుండానే నవ్వుతూ జారుకున్న ఆమె రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె తెలివైన సమాధానం చర్చనీయాంశంగా మారింది.

నొప్పింక.. తానొప్పక.. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి! ఈ శతకాన్ని మన స్టార్ సెలబ్రిటీలు కాస్త గట్టిగానే వంటబట్టించుకున్నట్టు ఉన్నారు. అందుకే జనాలకు ఏం కావాలో.. ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో? దాన్ని తప్ప అన్నింటినీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అడిగిన ప్రశ్నకు మాట దాటేస్తూ.. అతి తెలివిగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇదే చేశారు. గత కొన్ని రోజులుగా పెద్ది సినిమాలో మృణాల్ ఓ ఐటెం సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మృణాల్ పలు సందర్భాల్లో చిన్న చిన్న హింట్స్ ఇచ్చింది. కానీ కన్ఫర్మ్‌ మాత్రం చేయకుండా తప్పించుకు తిరుగుతోంది. ఇక ఈక్రమంలోనే శేష్‌తో పాటే మృణాల్ లీడ్గా యాక్ట్ చేసిన డెకాయిట్ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ హడావుడి కారణంగా మృణాల్.. ఓ ఇంటర్వ్యూలో చిక్కింది. అలా ఓ ఇంటర్వ్యూలో చిక్కిన మృణాల్‌ను, పెద్ది సినిమాలో మీరు ఐటెం సాంగ్ చేశారా? అని హోస్ట్ అడగగా.. అతి తెలివితో మాట దాటేసింది. పెద్ది గురించి అడిగితే.. తెలుగు ప్రజల అభిమానం గురించి.. తన సీరామం, హాయ్ నాన్న సినిమా వల్ల తనకొచ్చిన గుర్తింపు గురించి చెప్పుకొచ్చింది. అలా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. నవ్వేస్తూనే జారుకుంది. మళ్లీ తన రియాక్షన్ తో నెట్టింట క్యూట్‌గా వైరల్ అవుతోంది మృణాల్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌

Published on: Apr 10, 2026 12:46 PM
Follow Us