అర్థరాత్రి హీరోయిన్ గదిలోకి దూరిన దొంగ !! షాక్‌తో గట్టిగా అరిచిన ముద్దుగుమ్మ

Updated on: May 02, 2025 | 5:13 PM

బుల్లి తెర పై హీరోయిన్‌గా సక్సెస్‌ అయిన మౌనీ రాయ్‌.. అక్కడి నుంచి అప్‌గ్రేడ్‌ అయి బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హీరోయిన్‌గా .. గ్లామర్‌ డాల్లా తనను తాను ప్రూఫ్‌ చేసుకుంది. స్టార్ హీరోయిన్‌గా మారకపోయినా.. తనకు అందివచ్చిన అవకాశాలను మాత్రం జాగ్రత్తగా పట్టుకుని సినిమా చేసుకుంటూ పోతోంది. ఇక ఈక్రమంలోనే భూత్ని సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తనకు ఎదురైన ఓ షాకింగ్ ఇన్‌సిండెంట్ గురించి చెప్పింది.

ఇప్పుడు తన మాటలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ మౌనీ రాయ్‌ ఏం చెప్పారంటే.. ఓసారి ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ ఊరికి వెళ్లారట ఈమె. ఆ క్రమంలోనే అక్కడే ఉన్న ఓ హోటల్లో దిగారట. అయితే అప్పటికే మౌనీ రాయ్‌ రూమ్‌ కీని దొంగతనంగా డూప్‌లికేట్ చేయించిన ఓ వ్యక్తి.. అర్థరాత్రి పన్నెండునర టైంలో… ఆమె హోటల్ గదిలోకి చొరబడ్దాడట. అప్పటికీ మౌని రాయ్ తన మేనేజర్‌తో ఏదో విషయం గురించి మాట్లాడుతూ మేల్కొనే ఉండడంతో… ఆ వ్యక్తి దొంగ తనంగా రూమ్‌లోకి రావడాన్ని ఇద్దరూ చూశారట. చూడ్డడమే కాదు గట్టిగా అరిచారట కూడా.. ! దీంతో దెబ్బకు ఆ వ్యక్తి హోటల్ రూం నుంచి పారిపోయాడట. ఆ తర్వాత ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్‌ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగితే.. ఆన్సర్ సరిగా ఇవ్వలేదట. ఏది ఏమైనా.. ఆ సంఘటన మాత్రం తనకు చెమటలు పట్టించిదని.. అదే తన లైఫ్‌లో భయంకరమైన అనుభవమని వివరించింది ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తగా పెళ్లైన జంటకు బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌! ఆ ఘటన తలుచుకుని వరుడు షాక్‌

మగ సాలీడు డ్యాన్స్‌ నచ్చిందా ఓకే! లేదంటే హింసించి చంపేసే ఆడ సాలీడు

గూగుల్ డాట్‌ కాం కొన్న గుజరాతీ..! ఎంతకంటే ??

ఈ భూమిపైనే అతి పెద్ద భారీ అనకొండ ఇదేనట..!

సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!