లైంగికంగా వేధించాడంటూ కన్నీరు పెట్టుకున్న మోనాలిసా.. పెళ్లి తర్వాత సంచలన వ్యాఖ్యలు!

Updated on: Mar 27, 2026 | 11:03 AM

కుంభమేళా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా భోస్లే తన వివాహంపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా చేసిన లవ్ జిహాద్ ఆరోపణలను ఖండించారు. తాజాగా, సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని, షూటింగ్ సమయంలో తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వ సహాయం కోరారు.

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ద్వారా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే ఇటీవల వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఆమెపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేశారు. దీనిపై మోనాలిసా దంపతులు స్పందిస్తూ తమ వివాహం చట్టబద్ధమైనదని, ఎవరి మతాలను వారు పాటిస్తారని స్పష్టం చేశారు. తాజాగా కొచ్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. సనోజ్ మిశ్రా సినిమాల పేరుతో మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, షూటింగ్ సమయంలో తన శరీర భాగాలను తాకుతూ లైంగికంగా వేధించారని ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇవీ మా కండీషన్లు..అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

కంట తడి పెట్టించే ఏడు శునకాల కథ.. నెట్టింట వైరల్!

ఎల్పీజీ కొరత.. ఆటోడ్రైవర్ల వ్యథ

నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు

Loading...
Unable to load recommendations.
Follow Us