Mokshagna: నందమూరి వారసుడు ఈసారైనా వస్తాడా రాడా..?

Edited By:

Updated on: Aug 21, 2026 | 9:53 PM

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిన తర్వాత, తాజాగా దర్శకుడు వశిష్ట పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే కథ లాక్ అయినట్లు, దసరాకు సినిమా ఓపెనింగ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సోషియో ఫాంటసీ కథగా తెరకెక్కనుందని సమాచారం. అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అదుగో పులి.. ఇదిగో మేక అన్నట్లుంది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పరిస్థితి.. ఎప్పటిఎప్పుడు ఇప్పుడు అప్పుడూ అంటున్నారే కానీ మోక్షు ఎంట్రీపై క్లారిటీ మాత్రం రావట్లేదు. తాజాగా మరోసారి నందమూరి వారసుడి ఎంట్రీపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి రేసులో ఉన్న దర్శకుడెవరు..? మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు..? తన సినిమాలు చేసుకుంటూనే.. తనయుడి సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు బాలయ్య. గత రెండేళ్లుగా వారసుడిని పరిచయం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నా.. ఎందుకో ముహూర్తాలే సెట్ అవ్వట్లేదు. అన్నీ ఓకే అయినట్లే అవుతున్నా.. చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. ఆ మధ్య ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినా.. లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అయింది. ప్రశాంత్ వర్మతో అనుకున్న సినిమా ఆగిపోయాక.. బాలయ్య మళ్లీ తన సినిమాలతో బిజీ అయ్యారు. మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీపై ఆసక్తి తగ్గిపోయింది. కానీ సడన్‌గా రేసులోకి వశిష్ట వచ్చారిప్పుడు. విశ్వంభర సినిమా విడుదలకు రెడీ అవుతున్న వేళ.. నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత ఈ దర్శకుడి చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథ లాక్ అయిందంటున్నారు. విశ్వంభర అక్టోబర్‌లో విడుదలయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు వశిష్ట, మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ దసరాకే జరగనుందని తెలుస్తుంది. ఇది కూడా సోషియో ఫాంటసీ కథే అని.. బాలయ్య దగ్గరుండి మరీ కథ సిద్ధం చేయించారనే ప్రచారం జరుగుతుంది. నందమూరి కంపౌండ్‌లో ఇప్పటికే కళ్యాణ్ రామ్‌కు బింబిసార లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు వశిష్ట. మరి చూడాలిక.. మోక్షు ఈ ప్రాజెక్ట్‌తో అయినా లాంచ్ అవుతారేమో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

Loading...
Unable to load recommendations.
Follow Us