మేడారంలో.. కుక్కెత్తు బంగారం… హీరోయిన్ తీరుపై తీవ్ర విమర్శలు

Updated on: Jan 23, 2026 | 7:10 PM

తెలంగాణ రాష్ట్ర పండగ మేడారం జాతర సందడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కతో జాతరకు హాజరై, సమ్మక్క సారలమ్మలకు బెల్లంతో తులాభారం నిర్వహించారు. ఈ చర్యపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. పెంపుడు జంతువులకు ఇలాంటి మొక్కులు తగదని వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన మేడారం జాతర సందడి మొదలైంది. ఈనెల 28 నుంచి 31 వరకు ఈ జాతర జరగనుంది. కానీ ఇప్పటికే జాతరకు వందల సంఖ్యలో భక్తులు హాజరై సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటున్నారు. నెల రోజుల ముందు నుంచే గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య కూడా మేడారం జాతరలో సందడి చేశారు. ఇంత వరకు బానే ఉన్నా.. ఈమె.. తన పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారంతో తులాభారం చేయడమే ఇప్పుడు కాస్త వివాదంగా మారింది. టీనా శ్రావ్య! ఇప్పుడిప్పుడే తెలుగులో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్.కమిటీ కుర్రోళ్లు, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న శ్రావ్య.. ఇటీవల తన పెంపుడు కుక్కతో మేడారం జాతరకు వెళ్లింది. అక్కడ తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చొపెట్టి సమ్మక్క, సారలమ్మకు బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియోను ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే టీనా శ్రావ్య చేసిన పనికి విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొక్కులో భాగంగానే ఇలా చేశామని అంటున్నారు టీనా శ్రావ్య తల్లి అంటున్నా కూడా.. ఇలా పెంపుడు కుక్కలకు తులా భారం చేయడం ఏంటని మరి కొందరు శ్రావ్య తీరుపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amitabh Bachchan: అమితాబ్ ఇంట్లో గోల్డెన్ టాయిలెట్… సెల్ఫీ దిగి వైరల్ చేసిన హీరో

Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లిపై రష్మిక నాటీ ఆన్సర్

గ్యాప్ ఇచ్చిన టాలీవుడ్ సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపిరి పీల్చుకుంటున్న యంగ్ హీరోలు

Tamannaah Bhatia: స్పీడు పెంచిన మిల్కీ బ్యూటీ.. కేకపెట్టిస్తున్న కమ్ బ్యాక్

Ranveer Singh: ధురంధర్‌ తరువాత రణవీర్‌ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందా