Singer Mangli: వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..
సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌పై స్పందించింది. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన మంగ్లీ, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ప్రకటించింది. రమావత్ మధు చేసిన మోసాలతో తనకు సంబంధం లేదని, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకపూట భోజనం చేసినందుకు క్షోభ అనుభవిస్తున్నానని, అంతిమంగా నిజమే గెలుస్తుందని తెలిపింది.
సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. బాధితులు రోడ్డెక్కుతుండటం, బాధితుల తరపున గిరిజన సంఘాల నేతలు పోరాటం చేస్తుండటం మరింత హీట్ పెంచుతోంది. అయితే.. తనపై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందన్న మంగ్లీ..బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని ప్రకటించారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ ఆర్థిక మోసంలో తనకుఎ ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.. ఈ సమయంలోనే.. తనపై పెట్టిన కేసుపై మరోసారి మంగ్లీ స్పందించారు. రమావత్ మధుపై విరుచుకుపడిన సింగర్ మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు దుర్మార్గుడు అని తెలియక మాట్లాడానని, ఆ పరిచయంతో తన ఇంట్లో భోజనానికి రమ్మన్నాడని తెలిపింది. అతను పట్టుబట్టడంతో తన బ్యాండ్‌తో కలిసి ఇంటికెళ్లి భోజనం చేశానన్నారు. ఒకపూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా.. అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు మంగ్లీ. అంతేకాదు కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మంగ్లీ తన పోస్టులో రాసుకొచ్చారు. ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని.. రమావత్ మధు చేసిన మోసాల్లో తనకు 1శాతంకూడా సంబంధం లేదన్నారు. తాను ప్రజల్ని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదన్నారు. తన కుటుంబ సభ్యులకూ ఈ మోసంతో సంబంధం లేదన్నారు మంగ్లీ. బండి శివ పేరుని తన తమ్ముడు శివచౌహాన్‌గా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే అబద్దాన్ని చెబుతూ.. నిజం చేయాలనుకుంటున్నారని.. తాను.. తన కుటుంబ సభ్యులు ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుంది అంటూ మంగ్లీ ఓ నోట్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ నోట్ కాస్తా.. నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయా ??
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
సిలిండర్ ‘డెలివరీ’ మాయాజాలం.. లక్షల్లో వసూళ్లు
