Kannappa: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..!
పట్టు వదలని విక్రమార్కుడిలా.. కొన్ని సంవత్సరాలు కష్టపడి మరీ కన్నప్ప సినిమాను తెరకెక్కించాడు మంచు విష్ణు. తెరకెక్కించడమే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేశాడు. మంచి టాక్ తెచ్చుకున్నాడు. అయితే థియేటర్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ఇదే విషయమై మంచు విష్ణు నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
నిజానికి కన్నప్ప సినిమా రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా ఫిక్స్ కాలేదని స్వయంగా విష్ణునే చెప్పారు. తన సినిమాను ఓటీటీ సంస్థలు తక్కువకు అడుగుతుండడంతో.. రిలీజ్ అయి హిట్టైన తర్వాతే కన్నప్ప సినిమాను ఓటీటీ సంస్థలకు బేరం పెడతానంటూ చెప్పాడు. అయితే విష్ణు చెప్పినట్టే కన్నప్ప మూవీ ఓటీటీ డీల్ కుదిరింది. అమెజాన్ ప్రైమ్ కన్నప్ప సినిమాను మంచి ఫ్యాన్సీ రేట్‌కు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈనెల నాలుగో తేదీ నుంచి కన్నప్ప మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు హీరో మంచు విష్ణు నుంచి సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్ బయటికి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా చేస్తే సరిపోతుందా? ప్రమోషన్స్‌కి డుమ్మా కొడితే ఎలా? అనుష్క తీరుపై విమర్శలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు
100కోట్ల రేంజ్ అవుట్ పుట్ దిమ్మతిరిగే కాన్పెప్ట్.. హిట్టా..? ఫట్టా..?
