తెలుగులో బిజీ అవుతున్న మలయాళ ముద్దుగుమ్మలు

Edited By:

Updated on: Sep 10, 2026 | 8:25 PM

సౌత్‌ ఇండస్ట్రీలో మలయాళీ హీరోయిన్లకు ఉన్న క్రేజ్‌ మరోసారి కనిపిస్తోంది. 2026లో మమితా బైజు, అనస్వర రాజన్‌, కళ్యాణి ప్రియదర్శన్‌, మాళవిక మోహనన్‌ వరుస సినిమాలతో ట్రెండ్‌ అవుతున్నారు. ప్రేమలు ఫేమ్‌ మమితా బైజు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, అనస్వర తెలుగులోనూ అవకాశాలు అందుకుంటున్నారు. కళ్యాణి కొత్తలోకతో ఫామ్‌లోకి రాగా, మాళవిక ది రాజా సాబ్‌, సర్దార్‌ 2 సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

సౌత్ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఎంతైనా గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి వచ్చే బ్యూటీస్ కదా.. ఆ మాత్రం ట్రెండ్ అవ్వడంలో తప్పేం లేదు. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. తాజాగా దక్షిణాదిన కొందరు మలయాళీ బ్యూటీస్ తెగ ట్రైండ్ అవుతున్నారు. మరి ఆ మాయేంటో మనమూ చూద్దామా..? ఈ పాట వచ్చినప్పటి నుంచే అనస్వర రాజన్ గురించి తెలుగులోనూ చర్చ మొదలైంది. ఎవరీ అమ్మాయి.. ఇంత క్యూట్‌గా ఉందంటూ దర్శకుల వేట షురూ అయింది. తాజాగా అనస్వర తెలుగులో బిజీ అయిపోయారు. కాకా సినిమాలో చిరంజీవి కూతురుగా నటిస్తూనే.. మరోవైపు ఇట్లు అర్జున, అంతా రాములోరు చూస్కుంటారు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ మలయాళ కుట్టి. ఇక ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ లిస్టులో టాప్‌లో ఉన్నారు. 2026లో జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్‌లహోం కుడుంబ యూనిట్ సినిమాలతో వరుసగా 200 కోట్ల సినిమాలు అందుకుని ట్రెండ్ సెట్ చేసారు మమితా. నెక్ట్స్ ఈమె చేతిలో అరడజన్ సినిమాలున్నాయి. తెలుగులోనూ సరైన సినిమా కోసం వేచి చూస్తున్నారు మమిత బైజు. కెరీర్ మొదలుపెట్టిన చాన్నాళ్ళ తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ కొత్తలోక సినిమాతో ఫామ్‌లోకి వచ్చారు. పైగా సీక్వెల్ కూడా ఉంది. వీళ్లే కాదు.. సర్దార్ 2లో నటించిన మాళవిక మోహనన్ కూడా 2026లో బాగా ట్రెండ్ అయ్యారు. దీనికి ఓ కారణం ఏడాది మొదట్లో రాజా సాబ్ అయితే.. ఇప్పుడు కార్తి నటించిన సర్దార్ 2. మొత్తానికి చూస్తుంటే మళ్లీ మలయాళ ముద్దుగుమ్మల టైమ్ మళ్లీ మొదలైనట్లే కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!

పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు

హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక.. మెట్రో, ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం!

Loading...
Unable to load recommendations.
Follow Us