Lokesh Kanagaraj: కూలీతో అడ్డంగా బుక్ అయిపోయిన లోకేష్.. అందరికి టార్గెట్ అతడే
వీడు చెప్పేటప్పుడు ఆస్కార్ చూపిస్తారు.. తీసేటప్పుడు చుక్కలు చూపిస్తారు అంటూ దోచేయ్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని లోకేష్ కనకరాజ్‌పై వాడేస్తున్నారు కొందరు స్టార్స్. అదేంటి పుసుక్కున అంత మాట అనేసారు అనుకుంటున్నారా..? మరి ఏం చేస్తాం.. కూలీ తర్వాత లోకేష్ తీరుపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.
అసలేంటి మ్యాటర్ చూద్దామా..? లోకేష్ కనకరాజ్ కెరీర్ అంటే కూలీకి ముందు.. తర్వాత అని చెప్పాలేమో..? ఒక్క సినిమాతో ఈయన క్రేజ్ చాలా వరకు డ్రాప్ అయింది. రజినీకాంత్ లాంటి స్టార్ సినిమాలో ఉంటే.. కనీసం కథపై కాన్సట్రేట్ చేయకుండా ఏదో అలా చుట్టేసాడు అనే విమర్శలు లోకేష్‌పై బాగా గట్టిగా ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున విషయంలో ఫ్యాన్స్ డీప్‌గా హర్ట్ అయ్యారు. నాగార్జున గురించి ఎంతో బిల్డప్ ఇచ్చి.. చివరికి ఆ క్యారెక్టర్ నార్మల్ విలన్ పాత్రలాగే డిజైన్ చేసారనే విమర్శలు గట్టిగా వచ్చాయి. లోకేష్ టేకింగ్‌పై రిలీజ్ తర్వాత నాగ్ కూడా ఫీల్ అయ్యారని తెలుస్తుంది.. అందుకే ఇకపై ఈ నెగిటివ్ రోల్స్ మనకు సెట్ అవ్వవంటున్నారు మన్మథుడు. మరోవైపు అమీర్ ఖాన్ సైతం కూలీలో నటించి తప్పు చేసానని ఓపెన్‌గానే చెప్పారు. కూలీలో నటించడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అన్నారు అమీర్.. లోకేష్ కనకరాజ్‌పై ఇంతకంటే దారుణమైన కామెంట్ మరోటి ఉండదేమో..? తాజాగా రెబా మోనిక జాన్ సైతం కూలీలో తన పాత్రను లోకేష్ డిజైన్ చేసిన తీరుపై తప్పుబట్టింది. తనకు చెప్పిందొకటి.. అక్కడ ఉన్నదొకటి అంటున్నారు రెబా. ఇందులో శృతి చెల్లిగా నటించారు ఈ బ్యూటీ. మొత్తానికి కూలీ లోకేష్ ఇమేజ్ బాగా డ్యామేజ్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: ఎవరూ ఊహించని వివాదం లో కాంతార.. దానికి కారణం ఇదే
రికార్డ్ స్థాయిలో OG రిలీజ్.. వేచి చూస్తున్న కొత్త రికార్డులు
నీరుకొండపై 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
ఫస్ట్ టైమ్ రైలు పై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
షారూఖ్ ఫ్యామిలీపై మాజీ NCB అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం దావా
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

