కింగ్డమ్ సినిమాకు.. కేసీఆర్ మనవడి అదిపోయే రివ్యూ..
హిమాన్షు! ఈ పేరు కంటే.. కేసీఆర్ ముద్దుల మనవడిగా పాపులర్ అయిన ఈ చిన్నోడు.. కాస్త చిన్నప్పటి మీడియాలో వైరల్ అవ్వడం మొదలెట్టాడు. తన తాతలా మాట్లాడుతూ.. తన నడవడికలో తండ్రి కేటీఆర్‌ను గుర్తు చేస్తూ.. మంచి ఫాల్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి కింగ్డమ్ థియేటర్లో ప్రత్యక్షం అయి.. విజయ్ దేవరకొండ సినిమాను చూడడమే కాదు.. ఈ సినిమా ఎలా ఉందనేది ట్వీట్ చేశాడు.
తనే ఫ్రెండ్స్‌తో కలిసి ఆర్టీస్టీ క్రాస్ రోడ్స్‌లో కింగ్డమ్ సినిమా చూసిన హిమాన్షు.. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. కింగ్ డమ్ సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేశారు హిమాన్షు. RTC X రోడ్స్‌లో ఇద్దరు స్నేహితులతో కలిసి కింగ్‌డమ్ సినిమా చూశానని తన ట్వీట్‌లో రాసుకొచ్చిన హిమాన్షు… మొదటిసారిగా థియేటర్ ఉత్సాహభరితంగా అనిపించిందన్నాడు. థియేటర్ లోని బిగ్ స్కీన్, హైప్డ్ అప్ ఆడియన్స్ మధ్య కింగ్ డమ్ వైబ్ గూస్ బంప్స్ కలిగించిందని తన ట్వీట్లో రాసుకొచ్చాడు హిమాన్షు. అంతేకాదు విజయ్ దేవరకొండది అద్భుతమైన యాక్టింగ్ అని.. ఈ సినిమా చాలా నచ్చిందంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌లో హిమాన్షు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ డ్రోన్ల చక్కర్లు అందుకేనా..? ఆ పంట పండిస్తే అంతే
వర్షాకాలంలో ఏసీని ఇలా వాడితే.. పొడిగా మారే ఇల్లు..
వీర్య నిరోధక మాత్ర పనిచేస్తుంది