Kriti Shetty: డ్రీమ్‌ రోల్‌ ఏంటో రివీల్ చేసిన కృతి శెట్టి

Edited By:

Updated on: Oct 07, 2026 | 10:20 PM

‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకెళ్లిన కృతి శెట్టి.. ఆ తర్వాత వరుస పరాజయాలతో కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు సినిమాలకు దూరంగా ఇతర భాషల్లోనూ ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. ప్రస్తుతం మంచి కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్న కృతి.. తన డ్రీమ్‌ రోల్స్‌ను వెల్లడించారు. ప్రిన్సెస్‌, వారియర్‌ వంటి పవర్‌ఫుల్‌ పాత్రలు చేయాలనుందని చెప్పినట్లు సమాచారం.

కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస సినిమాలతో సూపర్ ఫామ్‌లో కనిపించిన కృతి శెట్టి, తరువాత తడబడ్డారు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవటం, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా… సక్సెస్ రాకపోవటంతో… ఈ బ్యూటీ కెరీర్‌లో కష్టాల్లో పడింది. ప్రజెంట్ బిగ్ బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ, తన డ్రీమ్‌ రోల్‌ను రివీల్ చేశారు. ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్‌ కృతి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్‌ట్రేట్‌ చేశారు బేబమ్మ. కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. మలయాళ సినిమా ఏఆర్ఎం తప్ప కృతికి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. కార్తికి జోడీగా నటించిన వా వాతియార్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే అప్‌ కమింగ్ సినిమాల విషయంలో టెన్షన్‌ పడుతున్నారు బేబమ్మ. ప్రదీప్‌ రంగనాథన్‌తో కలిసి నటించిన లవ్‌ ఇన్‌స్యూరెన్స్ కంపెనీ వరుస వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయి ఫలితం అయితే రాలేదు. కృతి, రవిమోహన్‌కు జంటగా నటించిన జీనీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్ధం కావటం లేదు. కెరీర్‌ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు తన డ్రీమ్‌ రోల్‌లను రివీల్ చేశారు కృతి. ప్రిన్సెస్‌, వారియర్ లాంటి పాత్రలు చేయాలనుందంటున్నారు ఈ బ్యూటీ. ప్రజెంట్ కృతి ఉన్న ఫామ్‌కి ఆ రేంజ్‌ క్యారెక్టర్‌లు ఇచ్చే సాహసం ఎవరైనా చేస్తారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు

Loading...
Unable to load recommendations.
Follow Us