కోలీవుడ్‌ను భయపెడుతున్న సీక్వెల్ సెంటిమెంట్

Edited By:

Updated on: Sep 16, 2026 | 1:40 PM

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సీక్వెల్‌ సెంటిమెంట్‌ ప్రతికూల ఫలితాలు ఇచ్చినట్లే, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ వరుస సీక్వెల్స్‌ నిరాశపరుస్తున్నాయనే చర్చ మొదలైంది. ‘ఇండియన్‌ 2’, ‘సర్దార్‌ 2’తో పాటు ‘చంద్రముఖి 2’, ‘సామి 2’, ‘బిల్లా 2’, ‘పందెం కోడి 2’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కథనం పేర్కొంది. మరోవైపు ‘జైలర్‌ 2’, ‘ఖైదీ 2’, ‘విక్రమ్‌ 2’, ‘ఇండియన్‌ 3’, ‘కాంచన 4’పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఒకప్పుడు తెలుగు సినిమాను వేధించిన సీక్వెల్ సెంటిమెంట్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి పాకింది. అప్పట్లో మన దగ్గర ఏ సినిమాకు పార్ట్ 2 చేసినా ఫలితం మాత్రం శూన్యమే. అది చిరంజీవి అయినా.. నాగార్జున అయినా పార్ట్ 2 చేసారంటే బొమ్మ డిజాస్టర్ అంతే. కానీ తర్వాత సీన్ మారింది. ఇప్పుడీ బ్యాడ్ సెంటిమెంట్ కోలీవుడ్‌లో కనిపిస్తుంది. సీక్వెల్స్ వరుసగా ముంచేస్తున్నాయక్కడ. బాహుబలి 2 నుంచి తెలుగులో సీక్వెల్స్ హిట్ అవ్వడం మొదలయ్యాయి. ఆ తర్వాత బంగార్రాజు, టిల్లు స్క్వేర్, పుష్ప 2, మ్యాడ్ స్క్వేర్ అంటూ చాలా సీక్వెల్స్ బాక్సాఫీస్ బద్దలుకొట్టాయి. కానీ తమిళంలో మాత్రం ఈ సీక్వెల్స్ వరుసగా నిరాశ పరుస్తున్నాయి. తాజాగా వచ్చిన సర్దార్ 2 కూడా అంచనాలు అందుకోలేదు.. దీనికి ముందు ఇండియన్ 2కు ఇదే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు తమిళనాట సింగం 2 లాంటి సీక్వెల్స్ బానే ఆడాయి. కానీ కొన్నేళ్లుగా సీన్ మారిపోయింది. చంద్రముఖి 2, సామి 2, బిల్లా 2, పందెం కోడి 2, విశ్వరూపం 2, విఐపి 2.. ఇలా ఏ 2ను తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యం. పార్ట్ 2లు భారీ అంచనాలతో వస్తున్నా.. వాటిని అందుకోవడంలో దారుణంగా బోల్తా కొడుతున్నాయి. హీరోతో సంబంధం లేకుండా సీక్వెల్స్ నిరాశ పరుస్తున్నాయి. ఇన్ని ప్లాపులు వస్తున్నా కూడా కోలీవుడ్‌లో సీక్వెల్స్ మాత్రం ఆగట్లేదు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా జైలర్ 2 రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 15న విడుదల కానుంది జైలర్ 2. అలాగే విక్రమ్ 2, ఖైదీ 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనకరాజ్. ఇండియన్ 3, కాంచన 4 లాంటి సీక్వెల్స్ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. మరి వీటి పరిస్థితేంటో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. అప్పటి నుంచే అమలు

Top9 ET news: హమ్మయ్య.. ఇప్పటికి రూట్ క్లియర్…| రాజమౌళి నుంచి ఊహించని అప్‌డేట్

Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!

Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు

షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?

Loading...
Unable to load recommendations.
Follow Us