Kiara Advani: ఈవెంట్‌ లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా కియారా అపీయరెన్స్

Edited By:

Updated on: Apr 25, 2026 | 12:12 PM

ప్రెగ్నెన్సీ తర్వాత కియారా అద్వానీ తన ఫ్యాషన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. GQ ఈవెంట్‌లో ఆమె స్టైల్, ఎలిగెన్స్ ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశాయి. తమన్నా, కృతిసనన్‌ వంటి తారల మధ్య కూడా కియారా రాణిగా మెరిశారు. ఆమె మెడలో ఉన్న క్రాస్ పెండెంట్ ఫ్యాషన్ కోసమా, నమ్మకమా అన్నది నెట్టింట హాట్ టాపిక్ అయింది. కియారా ఇప్పుడు స్టైల్ ఐకాన్.

పెళ్లయిందా? పిల్లలున్నారా? అన్నది కాదు.. నలుగురిలోకి వచ్చినప్పుడు.. ఒక ఈవెంట్‌కీ, ఓ పార్టీకి హాజరైనప్పుడు ఎంత ట్రెండ్‌లో ఉన్నామన్నది ఇంపార్టెంట్‌. ఈ విషయంలో కియారా అద్వానీని ఎవరూ బీట్‌ చేయలేరని అంటున్నారు ఫ్యాషన్‌ ఫ్రీక్స్. సెల్ఫ్ ప్రెజెంటేషన్‌, ఇంప్రెషన్‌ మేనేజ్‌మెంట్‌లో ఫెలో హీరోయిన్లందరూ కియారా దగ్గర క్లాసులకు వెళ్లాల్సిందేనని అడిషనల్‌ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఇంతకీ న్యూ మామ్‌ గురించి ఇప్పుడెందుకు ఈ చర్చ అంటారా? జీక్యూ ఈవెంట్‌లో కియారా ప్రెజెన్స్ కి ఆస్ట్రక్‌ అయ్యారు ఆడియన్స్. సింపుల్‌గానే కనిపిస్తున్నా, ఇంత ఎలిగెంట్‌గా ఎలా ఉన్నారంటూ వండర్‌ అవుతున్నారు అభిమానులు. ఆ ఈవెంట్‌కి తమన్నా, కృతిసనన్‌, రుక్మిణి వసంత్‌ అంటూ ఫీమేల్‌ సెలబ్రిటీలు క్యూ కట్టినా క్వీన్‌గా మెరిసింది మాత్రం కియారానే అనే కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. పోస్ట్ డెలివరీ పబ్లిక్‌ అప్పియరెన్స్ విషయంలో చాలా కూల్‌గా ఉన్నారు కియారా. అంతకు ముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ప్రెజెంట్‌ అండీ.. అనేస్తున్నారు. ట్రెండింగ్‌ కాస్ట్యూమ్స్ తో ఓన్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ని ఎస్టాబ్లిష్‌ చేస్తున్నారు. ఇన్నిటి మధ్యా కియారా మెడలో ఉన్న క్రాస్‌ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. కియారా ఫ్యాషన్‌ కోసం క్రాస్‌ వేసుకున్నారా? లేకుంటే వ్యక్తిగత నమ్మకాలతో ధరించారా? అనే చర్చ కూడా హాట్‌ హాట్‌గానే షురూ అవుతోంది. ప్రస్తుతం టాక్సిక్‌లో నటిస్తున్న కియారా, డాన్‌3లోనూ నాయికగా ఎంపికయ్యారన్నది ముంబై ఖబర్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు

చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..

ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు

ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?

దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా

Follow Us